ఒకప్పుడు అమెరికాలో తెలుగు సినిమా రిలీజవ్వడమే గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడక్కడ మన సినిమాలు మిలియన్ డాలర్లలో వసూళ్లు రాబడుతున్నాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’ అయితే ఏకంగా 20 మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టింది అమెరికాలో. వేరే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా అమెరికాలో మంచి వసూళ్లే రాబడుతుంటాయి. ఈ విషయంలో బాలీవుడ్ వాళ్లు కూడా మన హీరోల ముందు దిగదుడుపే.
ఐతే ఏమీ లేని చోట ఇంత మంచి మార్కెట్ పెరిగిందని.. అదనపు ఆదాయం వస్తోందని మన నిర్మాతలు సంతృప్తి చెందట్లేదు. అత్యాశకు పోయి ఓవర్సీస్ నుంచి అయిన కాడికి దండుకోవాలని చూస్తుండటంతో వస్తోంది సమస్య. పెద్ద సినిమాలు రోజు రోజుకూ రేట్లు పెంచేసి ఓవర్సీస్ బయ్యర్లతో జూదం ఆడుతున్నాయి. మరీ ఎక్కువ రేట్లు పెట్టేస్తున్న బయ్యర్లు.. సినిమా తేడా కొట్టిందంటే నిలువునా మునిగిపోతున్నారు.
‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత ఓవర్సీస్ లో ఆడిన తెలుగు సినిమానే లేదసలు. లేటెస్టుగా ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకున్నహైప్ చూసి ఏకంగా రూ.9 కోట్లు పెట్టి హక్కులు కొన్ని బయ్యర్ భారీ స్థాయిలోనే ఈ చిత్రాన్ని అమెరికాలో రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమాది ఆరంభ శూరత్వమే అయింది. బయ్యర్ లాభాల బాట పట్టాలంటే 2 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సిన ఈ చిత్రం.. అతి కష్టం మీద మిలియన్ మార్కును అందుకుంది. ఫుల్ రన్లో 1.5 మిలియన్ మార్కును అందుకోవడమే అసాధ్యంగా కనిపిస్తోంది.
ఓవర్సీస్ మార్కెట్ ను తెలుగు రాష్ట్రాల మార్కెట్ తో పోల్చి చూడకూడదు. ఇక్కడ ఆడిన సినిమాలన్నీ అక్కడ ఆడేయవు. ‘డీజే’నే అందుకు ఉదాహరణ. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం అక్కడ తేలిపోయింది. అందుకే పెద్ద సినిమాలపై పెట్టుబడి పెట్టడానికి ఓవర్సీస్ బయ్యర్లు భయపడిపోతున్నారు. ‘బాహుబలి’ అంత వసూళ్లు రాబట్టినప్పటికీ.. అందులో సగానికి సగం ఖర్చులకే పోతాయి. పెట్టుబడి ఎక్కువ కాబట్టి మరీ ఎక్కువ లాభాలేమీ వచ్చేయలేదు.
మహేష్ బాబును ఓవర్సీస్ లో తిరుగులేని స్టార్ అంటుంటారు. కానీ మహేష్ లాస్ట్ మూవీ ‘బ్రహ్మోత్సవం’ ఓవర్సీస్ లో దారుణమైన ఫలితాన్నిచ్చింది. భారీ నష్టాలు మిగిల్చింది. పవన్ కళ్యాణ్ గత రెండు సినిమాలూ అక్కడ తేలిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా కొన్నిసార్లు కలెక్షన్లు వచ్చేస్తాయి కానీ.. అమెరికాలో అలా కాదు. అక్కడ భారీ రేట్లకు సినిమాను కొంటారు కాబట్టి బయ్యర్లు టికెట్ల రేట్లు ఎక్కువ పెడతారు. కాబట్టి సినిమా బాగుందంటే తప్ప జనాలు థియేటర్లకు వెళ్లరు. టాక్ అక్కడ చాలా కీలకం. అది తేడా వస్తే సినిమా నిలవడం కష్టం.
ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ లో పెద్ద సినిమాల మీద పెట్టుబడి పెట్టేందుకు బయ్యర్లు వెనుకంజ వేస్తున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న భారీ సినిమాలన్నింటికీ ఓవర్సీస్ కోసం భారీ రేట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా రేటు రూ.25 కోట్లట. మహేష్ బాబు ‘స్పైడర్’కు కూడా దాదాపు ఇంతే రేటు చెబుతున్నారట. ఎన్టీఆర్ ‘జైలవకుశ’ రేటు కూడా రూ.20 కోట్ల దాకా చెబుతున్నారట. కానీ బయ్యర్లు ఈ రేట్లకు కొనడానికి భయపడుతున్నారు. ఐతే నిర్మాతలు కూడా ఆశ తగ్గించుకోవట్లేదట.
ఇంతేసి రేట్లకు సినిమా కొని.. రేప్పొద్దున తేడా వస్తే నష్టాలు భారీగా ఉంటాయి. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే లాభాలు మరీ పెద్ద స్థాయిలో ఏమీ ఉండవు. లాభం వస్తే అది తక్కువగా ఉంటుంది. నష్టం వస్తే మాత్రం భారీగా ఉంటుంది. చిన్న సినిమాల మీద తక్కువ పెట్టుబడి పెడితే.. రిస్క్ తక్కువగా ఉంటుంది. సినిమా క్లిక్ అయితే లాభాలు భారీగా ఉంటాయి. పోయినేడాది క్షణం.. పెళ్లిచూపులు లాంటి సినిమాలు వాటి బయ్యర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. అందుకే పెద్ద సినిమాల విషయంలో మునుపటితో పోలిస్తే ఓవర్సీస్ బయ్యర్లు అంత ఆసక్తి చూపించట్లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/