దేశంలోనే అత్యధికంగా సినిమాలు తీసే పరిశ్రమ మనది. ఏడాదికి ఏకంగా 150 సినిమాల దాకా తయారవుతాయి మన దగ్గర. కానీ ఆ 150 సినిమాలూ థియేటర్లలోకి రావడమంటే కష్టమే. రోజు రోజుకీ సినిమాల సంఖ్య పెరిగిపోతోంది. రిలీజ్ కష్టాలు కూడా పెరిగిపోతున్నాయి. సినిమా తీయడం కంటే సరైన టైమింగ్ చూసి రిలీజ్ చేసుకోవడం కష్టమైపోతోంది.
ఇంతకుముందు చిన్న సినిమాలకు మాత్రమే సమస్య ఉండేది. ఇప్పుడు ఓ మోస్తరు - పెద్ద సినిమాలకు సైతం మాంచి రిలీజ్ డేట్ దొరకడం.. పోటీ లేకుండా విడుదల చేసుకోవడం కష్టమైపోతోంది. గత వారం క్రిస్మస్ సందర్భంగా ఏకంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. ఆ నాలుగూ కూడా ఓ మోస్తరు స్థాయి సినిమాలే కావడం విశేషం. ఇలా ఒకేసారి నాలుగు మీడియం రేంజి సినిమాలు గతంలో ఎప్పుడూ విడుదలయ్యేవి కావు.
ఇక రాబోయే శుక్రవారం కూడా మూడు మీడియం రేంజి సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. నేను శైలజ - అబ్బాయితో అమ్మాయి - కిల్లింగ్ వీరప్పన్ సినిమాలు జనవరి 1న విడుదల కాబోతున్నాయి. ఇక తర్వాత సంక్రాంతికైతే నాలుగు సినిమాలు రాబోతుండగా.. అందులో మూడు భారీ సినిమాలు. నాన్నకు ప్రేమతో - డిక్టేటర్ - సోగ్గాడే చిన్నినాయనా.. మూడూ కూడా తగ్గట్లేదు. సంక్రాంతికే అని పట్టుబట్టుకుని కూర్చున్నాయి. వీటితో పాటు ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ కూడా బరిలో ఉంది.
ఇలా పోటీపడటం ఎవరికీ మేలు కలిగించేది కాదు. లాభం కంటే నష్టమే ఎక్కువ. వసూళ్లలో కోత తప్పదు. అయినప్పటికీ ఆ నష్టాన్ని భరించడానికే తయారవుతున్నారు తప్పితే.. రిలీజ్ డేట్ మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు తప్పితే.. ఇలా ఒకరితో ఒకరు తలపడ్డం వల్ల పడే వసూళ్ల కోత గురించి మాత్రం ఆలోచించట్లేదు.