సైరా నరసింహారెడ్డి తర్వాత వచ్చిన చెప్పుకోదగ్గ కొత్త సినిమా ఏది అంటే గోపీచంద్ చాణక్య మాత్రమే. అది చేదు ఫలితాన్ని అందుకోవడంతో సైరా ఇంకొద్ది రోజులు వసూళ్ళ జాతర చేసుకుంది. టాక్ బాగున్నప్పటికీ సరైన రీతిలో మార్కెటింగ్ చేయకపోవడంతో ఎవరికీ చెప్పొద్దు పెద్దగా ఎవరికి తెలియకుండానే హాల్లో నుంచి మాయం అయ్యేలా ఉంది. ఇక ఈ వారం మరో మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.
ఇక ఆది సాయి కుమార్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాశ్మీరీ పండిట్ ల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఆర్మీ థ్రిల్లర్ తాలూకు ప్రమోషనల్ మెటీరియల్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం అయితే లేదు. టాక్ కోసం ఎదురు చూడాల్సిందే.
కృష్ణారావు సూపర్ మార్కెట్ అనే మరో చిన్న సినిమా కూడా అదే రోజు వస్తోంది. ప్రేక్షకులకు దీని గురించి కనీస అవగాహన కూడా లేదు. మరి కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ ని ఈ మూడు సినిమాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి. కంటెంట్ ఉన్నట్టు కనిపిస్తున్నా ఓపెనింగ్స్ కు కావాల్సిన బజ్ అయితే దేనికీ ఎక్కువ కనిపించడం లేదు. మరి ఏవైనా అనూహ్య ఫలితాలను ఇస్తాయేమో వేచి చూద్దాం.
మొదటిది రాజు గారి గది 3. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ మూడో భాగపు హారర్ కామెడీ ఆ జానర్ లవర్స్ ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. హీరో అశ్విన్ బాబు హీరోయిన్ అవికా గోర్ ఇద్దరికీ పెద్దగా ఇమేజ్ లేకపోవడంతో కేవలం మౌత్ పబ్లిసిటీ రివ్యూలను నమ్ముకుని వస్తోంది.