తెలుగు స్టార్స్ ని మాటంటే.. కబడ్దార్!!

Update: 2017-07-22 17:30 GMT
సినీ తారలను అభిమానించడం అనే కల్చర్ ప్రపంచంలో ఎక్కడైానా ఉంటుంది. కానీ వారిని మనుషులకు మించి శక్తులు కట్టబెట్టేసి.. వాళ్లను దేవుళ్లుగా ఆరాధించడం మాత్రం సౌతిండియాలోనే కనిపిస్తుంది. తెలుగులో ఈ స్వామి భక్తి మరీ విపరీతంగా ఉంటుంది. తెలిసే కాదు.. తెలియకుండా కూడా వారిని ఏమీ అనకూడదు. పొరపాటున అన్నారో.. ఇంక అంతే!

కె. రాఘవేంద్రరావుపై తాప్సీ పన్ను చేసిన కామెంట్స్ ఫలితం కళ్లారా చూశాం. అన్ని రకాల పళ్లు అయిపోవడంతో.. తనపై కొబ్బరికాయ వేశానని ఆ వీడియోలోనే చెప్పిందట తాప్సీ. కానీ ఎడిట్ చేసిన వీడియో కారణంగా.. తనపై విమర్శలు వచ్చాయన్న ఈమె.. ఇప్పుడు క్షమాపణలు చెప్పింది. ఇదే ఝుమ్మంది నాదం మూవీ హీరో మంచు మనోజ్ మనోజ్ మంచు లక్ష్మి.. తాప్సీకి సపోర్ట్ ఇవ్వడం విశేషం.

చిన్నపాటి హీరోయిన్ మానస హిమవర్ష ఉదంతం కూడా ఇలాంటిదే. బిగ్ బాస్ ను కాంట్రవర్షియల్ గా మార్చేందుకు రకరకాల యాక్టింగ్స్ చేయాలని నిర్వాహకులు చెప్పడంతో.. ఈమె తప్పకుంది. అయితే.. పార్టిసిపెంట్స్ చేస్తున్న ఆ యాక్టింగ్ కు జనాల నుంచి వచ్చిన రియాక్షన్ చూసి.. తాను ఈ షో చేయనందుకు సంతోషిస్తున్నట్లు చెబితే.. ఎన్టీఆర్ ను ఏదో అనేసిందనే ఫీలింగ్ వచ్చింది. దీంతో సారీ చెప్పాల్సి వచ్చింది.

డీజేకి రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయని దర్శకుడు చెబితే.. మెగాస్టార్ ఫ్యాన్స్ దిల్ రాజును నిలదీసిన సందర్భం కూడా రీసెంట్ గానే జరిగింది. తను ఎలాంటి పోలికలు తేలేదని దిల్ రాజు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అసలు ఫంక్షన్ ఉద్దేశ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నారంటూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో చెప్పను బ్రదర్ అనేసి వివాదంలో ఇరుక్కున్న బన్నీ.. దానిపై కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

కొన్నేళ్ల క్రితం మహేష్ బాబు 1 నేనొక్కడినే పోస్టర్ విషయంలో సమంత రియాక్ట్ అయితే.. గెట్ లాస్ట్ సమంత అంటూ మహేష్ ఫ్యాన్స్ తిట్టిపోశారు. మొత్తం మీద టాలీవుడ్ స్టార్స్ ను ఎవరూ ఏమీ అనకూడదనే పాయింట్ అయితే బాగా హైలైట్ అవుతోంది.
Tags:    

Similar News