సెకండ్ వేవ్ అనంతరం లాక్ డౌన్ సడలించినా కానీ ఈసారి నియమనిబంధనలు మరింత కఠినతరంగా అమలు చేసేందుకు తెలుగు ఫిలింఛాంబర్ పక్కా రూల్స్ ని ప్రతిపాదించింది. ఈసారి ఎవరైనా సెట్స్ కి వెళ్లాలంటే తప్పనిసరిగా టీకాలు ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. లేదంటే సెట్స్ లోకి అనుమతించరు.
తెలుగు చిత్ర పరిశ్రమ 2 నెలల తర్వాత సాధారణ స్థితికి వస్తోంది. కానీ ఈసారి మునుపటిలా సమస్యను రిపీట్ కానివ్వకూడదు. కోవిడ్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వెలువడ్డాయి. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ - తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ - మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమై నటులు - సాంకేతిక నిపుణుల కోసం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించారు.
మొత్తం 24 శాఖలకు చెందిన సాంకేతిక నిపుణులు కార్మికులు ఏప్రిల్ నాటికి పనిచేస్తున్న ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని కొత్త మార్గదర్శకాలు పేర్కొన్నాయి. నటులు -సాంకేతిక నిపుణులు తమ ప్రస్తుత ఒప్పందాలను పూర్తి చేసిన తర్వాత మాత్రమే కొత్త ప్రాజెక్టులపై సంతకం చేయాలి.
అలాగే షూటింగ్ రోజుల సంఖ్యను తగ్గించి తక్కువ సమయంలో బ్యాలెన్స్ షూట్ ను మూసివేయమని దర్శకులకు చెబుతారు. షూటింగ్ లను తిరిగి ప్రారంభించే ముందే తారాగణం సిబ్బంది నుండి టీకాలు వేసిన ధృవీకరణ పత్రాలను పొందాలని ప్రొడక్షన్ హౌస్ లకు ప్రతిపాదించారు. తారాగణం సిబ్బంది అందరూ కనీసం టీకా మొదటి మోతాదును పొందాలి. ఇంకా ఫిల్మ్ ఫెడరేషన్ ఇతర అనుబంధ చలనచిత్ర సంస్థలు 24 శాఖల సభ్యులందరికీ జీవిత బీమాను సులభతరం చేయాలి.