పవన్ పై నటి శ్రీరెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారిన సంగతి తెలిసిందే. తనపై చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా చానెళ్లు పనిగట్టుకొని పదే పదే ప్రసారం చేశాయని....అదీ కాకుండా ఇండస్ట్రీ వాళ్లని మీడియా టార్గెట్ చేస్తున్నా టాలీవుడ్ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని పవన్ ఫిల్మ్ చాంబర్ వద్ద హడావిడి చేశారు. మీడియా చానెళ్ల వైఖరిని పవన్ చాలా సీరియస్ గా తీసుకోవడంతో ఇండస్ట్రీ పెద్దలు....మిగతా హీరోలు కూడా ఆలోచనలో పడ్డారు. మొన్నటికి మొన్న ఓ లైవ్ షోలో.....ఇండస్ట్రీలోని మహిళలనుద్దేశించి....ఓ న్యూస్ ప్రజెంటర్ అసభ్య పదజాలంతో దూషించడం పెనుదుమారం రేగింది. అయితే, ఏదో కంటితుడుపు సారీ స్క్రోలింగ్ తో ఆ చానెల్ ఆ విషయాన్ని ముగించేసింది. సదరు విలేఖరిపై కఠిన చర్యలు తీసుకోవాలని `మా` ముక్తకంఠంతో ఖండించడం...కొవ్వొత్తుల ర్యాలీలు చేయడం జరిగినా....పెద్దగా ఫలితం లేకపోయింది. దీంతో, మీడియాపై కొంతమంది ఇండస్ట్రీ పెద్దలు కూడా గుర్రుగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ....ఇండస్ట్రీలోని బడా హీరోలు నిన్న ఓ అత్యవసర సమావేశం నిర్వహించి....మీడియాపై ఇండస్ట్రీ వైఖరి ఎలా ఉండాలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. న్యూస్ చానెళ్లకు ఇండస్ట్రీతో చాలా అవసరముందని...కాబట్టి వాటిపై కఠిన వైఖరి అవలంబించాలని...న్యూస్ చానెళ్లకు సినిమా ప్రెస్ మీట్ లు ఇంటర్వ్యూలు నిషేధించాలని సమావేశంలో నిర్ణయించారని వదంతులు వస్తున్నాయి. అవసరమైతే న్యూస్ చానెళ్లకు సినిమా కంటెంట్ బ్లాక్ చేసి...కేవలం ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లకే ఇవ్వాలని నిర్ణయించినట్లు పుకార్లు వినబడుతున్నాయి. అయితే, అటువంటిదేమీ జరగలేదని...ఆ మీడియా చానెళ్ల గురించి మాట్లాడిన మాట వాస్తవమేనని....మరోసారి సమావేశమైన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని విశ్వసనీయ వర్గాల భోగట్టా.
అసలు సమావేశంలో ఏం మాట్లాడుకున్నారన్న సంగతి కాసేపు పక్కనబెడితే....ఇండస్ట్రీలో మీడియా(సినిమా జర్నలిస్టులు) కూడా ఒక భాగమని సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు `మా` సభ్యులు కూడా పలుమార్లు నొక్కి వక్కాణించారు. ఇండస్ట్రీకి...మీడియా .,చక్రానికి ఇరుసు వంటిదని అభిప్రాయపడ్డారు. అయితే, ఇండస్ట్రీని మీడియా సాఫ్ట్ టార్గెట్ చేస్తోందని డ్రగ్స్ వ్యవహారం నుంచి కొందరు సినీ సెలబ్రిటీలు గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ డ్రగ్స్ వ్యవహారాన్ని పది రోజులు పాటు మీడియా చానెళ్లన్నీ పండగ చేసుకున్నాయి. వాస్తవానికి, ఆ డ్రగ్స్ కేసులో కొందరు బడాబాబులు, పొలిటీషియన్ల పేర్లు వినబడ్డా....సినీ ప్రముఖలపైనే షోలు, డిబేట్లు పెట్టేశారు. దీంతోపాటు తాజాగా పవన్ వ్యవహారం...శ్రీరెడ్డిని మీడియా చానెళ్లు ప్రొజెక్ట్ చేయడం..వంటివి నచ్చకపోవడంతో న్యూస్ చానెళ్లకు తమ కంటెంట్ ను ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని కొందరు హీరోలు నిన్నటి సమావేశంలో సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చారని టాక్. అందులోనూ సినిమావాళ్ల ప్రోగ్రామ్ లను ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలోనే ఎక్కువగా చూస్తారు ప్రేక్షకులు. వీటితో పోల్చుకుంటే న్యూస్ చానెల్స్ లో చూసేది కొంచెం తక్కువే. అయితే, సినిమా రిలీజ్ ల సమయంలో యాడ్స్...ప్రమోషన్లు..ఆడియో ...ప్రీ లాంచ్ ఈవెంట్లు గట్రా కార్యక్రమాల కోసం న్యూస్ చానెళ్లు, పత్రికలతో ఇండస్ట్రీకి ఎక్కువగా అవసరం ఉంటుంది. దాంతోపాటు సినిమాలకు రివ్యూలు....పాజిటివ్ ....నెగెటివ్ టాక్ వంటి వ్యవహారాలలో న్యూస్ చానెళ్లు, పత్రికల పాత్ర ఎక్కువే. గతంలో కూడా మీడియాపై గుర్రుగా ఉన్న ఇండస్ట్రీలోని ఓ నిర్మాణ సంస్థ....ఓ పత్రికకు యాడ్ లు గట్రా ఆపేసింది. దీంతో, రివేంజ్ ప్రోగ్రాం కింద....వారి సినిమా బాలేదని....రివ్యూ ఇచ్చిపడేసింది. దాంతో, తర్వాతి సినిమాకు కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది.
ఓ రకంగా చెప్పాలంటే....మీడియాలో కొన్ని లోపాలున్నాయి....ఇండస్ట్రీలో కూడా దాదాపుగా అన్నే లోపాలున్నాయి. దీంతో, ఒకరికి ఒకరు సహకరించుకొని మధ్యే మార్గాన్ని అవలంబించడం ఇరు వర్గాలకు శ్రేయస్కరం అన్న వాదనలు వినిపిస్తున్నారు. అలా కాకుండా భేషజాలకు,..పట్టింపులకు పోతే ఇరు వర్గాలకు నష్టం జరుగుతుంది. అయితే, అద్దాల మేడలో ఉన్న ఇండస్ట్రీ వారికి కొంత ఎక్కువ నష్టం జరగడానికి అవకాశముంది. ఎందుకంటే.....పవన్ లా ప్రతి ఒక్కరూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ...మీడియాపై సమర శంఖం పూరించడం సాధ్యం కాక పోవచ్చు. అయితే, ఇప్పటి వరకు ఇండస్ట్రీని ప్రైమ్ టార్గెట్ చేసిన మీడియా సంస్థలకు పవన్ ట్వీట్లు ఓ చెంపపెట్టువంటిది. దీంతో, ఇకపై మీడియా సంస్థలు కూడా కొంత అప్రమత్తంగా ఉండడానికి ట్రై చేసే అవకాశముంది. గత నాలుగు రోజులుగా...ఏ చానెల్ లోనూ శ్రీరెడ్డి తాలూకు ప్రోగ్రాంలు....అనవసర డిబేట్లు లేకపోవడం ఇందుకు నిదర్శనం. ఇటు మీడియా సంస్థల అధిపతులు....అటు ఇండస్ట్రీ పెద్దలు సావధానంగా ఈ సమస్యను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేయడం మంచిది. ఒకేసారిగా మీడియాను బహిష్కరిస్తామని...బ్లండర్ నిర్ణయాలు తీసుకోకుండా...అవసరమైనన్ని యాడ్ లు ఇవ్వడం...అవసరమైనపుడే మీడియాలో కార్యక్రమాల్లో హాజరవడం....వంటివి చేయడం వల్ల ఇండస్ట్రీకి ఉపయోగం. ఇలా మధ్యే మార్గంగా పోయి కట్టే నలగలేదు..పాము చావలేదు అన్న చందాన ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటే మంచిది.