ఫిబ్రవరి నెలలో చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అన్నీ సినిమాలు విజయం సాధించలేవు కదా. కొన్నే హిట్లు... మిగతావి ఫ్లాపులు. జనవరి 31 న విడుదలైన 'అశ్వత్థామ' తో ఫిబ్రవరి నెల నీరసంగా ప్రారంభమైంది. ఈ సినిమా లాభాలు తీసుకురాలేకపోయింది. ఇక ఫిబ్రవరి మొదటివారంలో 7 వ తారీఖున సమంతా- శర్వానంద్ నటించిన 'జాను' రిలీజ్ అయింది. ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలిచింది.
క్రేజీ యువహీరో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైంది. రిలీజ్ కు ముందు నుంచి నెగెటివ్ బజ్ ఉన్న విజయ్ సినిమాకు రిలీజ్ తర్వాత కూడా కొనసాగింది. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా నిరాశాజనకంగా సాగింది.
ఇక ఫిబ్రవరి 21 న నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కిన 'భీష్మ' విడుదలైంది. మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధించింది. వీక్ డేస్ లో కలెక్షన్స్ కొంత మందగించిన ఫైనల్ గా సినిమా లాభాల్లోకి వచ్చింది. ఫిబ్రవరికి ఇది బిగ్గెస్ట్ హిట్.
ఇక విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'హిట్' నెలాఖరులో రిలీజ్ అయింది. యావరేజ్ టాక్ తో డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తున్న 'హిట్' త్వరలోనే లభాల్లోకి వస్తుందని ట్రేడ్ వర్గాల వారు చెప్తున్నారు. ఈ సినిమా విజయంతో ఫిబ్రవరి రెండో అర్థ భాగం టాలీవుడ్ కు కలిసొచ్చింది.