2017 సంవత్సరం చివరికి వచ్చేసింది. సినిమా పరంగా చూసుకుంటే ఈ ఏడాదిని నిస్సందేహంగా బాహుబలి నామ సంవత్సరంగా చెప్పేయొచ్చు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పటివరకు హయ్యస్ గ్రాసర్స్ లో మొదటి రెండు స్థానాలు బాహుబలి రెండు పార్టులే. చాలా గ్యాప్ తర్వాత తిరిగి కెమెరా ముందుకొచ్చిన మెగా స్టార్ చిరంజీవి పాత రికార్డులన్నింటి దుమ్ము దులిపి తన సత్తా చాటాడు.
వచ్చే ఏడాది దాదాపు అందరు పెద్ద హీరోల భారీ ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రిలీజ్ కానుంది. అత్తారింటికి దారేదితో ఇండస్ట్రీ రికార్డ్ బద్దలుకొట్టిన త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ మరోసారి రికార్డులు తిరగరాస్తుందని అభిమానులు బలంగానే నమ్ముతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం సాహో కూడా 2018లోనే రానుంది. ఈ సినిమా ప్రభాస్ స్టామినా ఏమిటో తేల్చిచెప్పనుంది. దీంతోపాటు సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ చేస్తున్న రంగస్థలం-1985.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా కూడా కొత్త ఏడాది మొదటి మూడు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వరస చేదు అనుభవాలతో ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు ఈసారి తనకు అద్భుతమైన హిట్ ఇచ్చిన కొరటాల శివతో జట్టు కట్టి భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు.
‘‘రికార్డులు అనేవి మారిపోతూనే ఉంటాయి. కానీ ఒక్క విషయం మనం బలంగా నమ్మొచ్చు. రూ. 100 కోట్ల క్లబ్బులో మరిన్ని తెలుగు సినిమాలు చేరబోతున్నాయి’’ అని సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ అంటున్నారు. 2108లో రిలీజయ్యే భారీ బడ్జెట్ చిత్రాలన్నీ రికార్డులు తిరగరాయగల సత్తా ఉన్నవే. అయితే వీళ్లందరిలో 2018 టాప్ గ్రాసర్ కిరీటం మాత్రం ఒకరికే దక్కుతుంది. ఆ టైటిల్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.