స్వాతి. బింధు మాదవి. మాధవీ లత. శ్రీదివ్య. ఆనంది. రేష్మ. శ్రావ్య. ఇప్పటికే మీకు సీన్ అర్ధమయ్యి ఉండాలి. నిజానికి వీళ్ళందరూ మన తెలుగు భామలే. కాని వీళ్లకు టాలీవుడ్డులో ఛాన్సులు తక్కువ, పక్క రాష్ట్రంలలో ఛాన్సులు ఎక్కువ అన్న చందంగా ఉందీ సీన్. అసలు మనోళ్ళ మనోళ్ళకు ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు. తెలుగుమ్మాయిలకు అవకాశాలు రాకపోవడానికి కారణమేంటి?
ఒకప్పుడు బొంబాయ భామలను ఇంపోర్ట్ చేసుకోవడానికి ముఖ్య కారణం వారి స్కిన్ కలర్ అని చెప్పుకునేవారు. సిమ్రాన్, సాక్షిశివానంద్ వంటి భామలు ఎంతో వైట్ కలర్‌లో రోజ్ రోజ్ గా ఉండటం వలనే వారి హవా నడిచిందని వినిపించేది. అయితే ఇప్పటి ట్రెండ్ లో అంత సీన్ లేదు. అసలు ఈ కలర్ ఒక ఫ్యాక్టర్ కాదు. సమంత, త్రిష, అమలా పాల్, క్యాథరీన్ త్రెసా, లక్ష్మీ మీనన్.. ఇలా అందర డస్కీ బ్యూటీలే. ఏదో తాప్సీ, కాజల్, ఛార్మి వంటి వారే కాస్త ఎల్లో కలర్‌లో కనిపించే భామలు. ఇక తమన్నా ఒక్కత్తే ఫుల్ రోజ్. ఇలా చెబితే రేసిస్ట్ కామెంట్లు అనుకుంటారేమో కాని, ఇలాంటి భేషజాలు ఉన్నమాట వాస్తవం. కాని తెలుగుమ్మాయిలందరూ అన్నీ రకాల రంగుల్లోని దర్శనమిస్తున్నారు. సో, ఈ యాంగిల్ కొట్టేద్దాం.
మరి యాక్టింగ్ ట్యాలెంట్ అంటారా... సమంతకు ధీటుగా స్వాతి పెర్ఫామ్ చేయదా? శ్రీదివ్య యాక్టింగులో ఉండే కిక్కు తాప్పీ యాక్టింగులో అస్సల్లేదేమో? మాధవి లతకు ఉండే గ్రేస్ క్యాథరీన్ లో ఎక్కడుంది? అయినాసరే మనోళ్ళ మన భామలను పక్కనెట్టేశారు. డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా వీళ్ళకు బాగానే ఉన్నాయి. కాస్త సానబెడితే మెరిసిపోతారు. మరి వీళ్లకు తీసుకోకపోవడానికి సమస్య ఏంటంటారు?
ఒక విధంగా చెప్పాలంటే తెలుగమ్మాయి యాటిట్యూడ్ అనే చెబుతాం అంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా పైన చెప్పిన తెలుగు భామల్లో ఎవ్వరూ కూడా తమ తొలి హిట్టు సినిమాలో ఉన్న లుక్ ను ఇప్పుడు మెయిన్‌టైన్ చెయ్యట్లేదు. అందరూ కాస్త బొద్దెక్కారు. అదే సమంత, కాజల్, శ్రీయ, తమన్నాలు.. రెగ్యులర్ గా జిమ్ములు, యోగాలూ చేస్తూ స్లిమ్ ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తున్నారు. ఆ హొయలొలికించే ఒంపుసొంపుల బాడీయే వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందేమో. కాని ఈ కారణం కూడా తెలుగు పిల్లలను తీసుకోకపోవడానికి చెప్పదగనిది కాదు.
పొనివ్ మన భామలకు భాష వచ్చుకాబట్టి వీళ్ళ చాటింగ్ పురాణం అర్ధమైపోతుందని అనుకుంటున్నారా? ఆ లెక్కన చూస్తే సమంత, తమన్నాలకు తెలుగు ఫుల్ గా అర్ధమవుతుంది. సో, అదీ కాదు. ఇంతకీ తెలుగు భామలను తెలుగు దర్శకనిర్మాతలు ఎందుకు హీరోయిన్లుగా పెట్టుకోవట్లేదు. చరణ్ సినిమాల్లో కలర్స్ స్వాతిని, శర్వానంద్ సినిమాల్లో శ్రీదివ్యను, బన్నీ సినిమాలో బింధు మాధవిని తీసుకుంటే వచ్చే నష్టమేంటి? మన తెలుగు దిగ్గజాలే ఈ విషయంపై నోరు విప్పాలి.
-హ్యాప్రా