ఇప్పుడు టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు కొరత ఉందనే మాట అక్షరాలా నిజం. హీరోయిన్లకు కొదువ లేకపోయినా.. వాళ్లంతా పరాయి భాష నుంచి అరువు తెచ్చుకున్న బాపతే. వాళ్లకు తెలుగులో అఆలు కూడా రాకపోయినా.. అచ్చ తెలుగోళ్లలా మేకప్ వేసి బండి లాగించుకుంటున్నారు దర్శక నిర్మాతలు. గతంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. మన తెలుగు హీరోయిన్లే పక్క భాషలకు వెళ్లి సత్తా చూపించేవారు. సావిత్రి - జమున - శారద - వాణిశ్రీ - జయప్రద.. ఇలా చాలామంది హీరోయిన్లు ఇతర భాషల్లో కూడా వెలిగిపోయారు.
కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారిపోయింది. ఇక్కడ వెలిగేవారంతా పరాయి భాషలవాళ్లే. ముఖ్యంగా తమిళ్ - మలయాళీ హీరోయిన్స్ ను బాగా అక్కున చేర్చుకుంటున్నారు. కానీ మన తెలుగమ్మాయిలు మాత్రం పక్క భాషల్లో బాగానే సక్సెస్ లు కొడుతున్నారు. ఈ వారమే విడుదలైన 'ఇరైవి' మూవీతో తమిళ్ లో సూపర్ హిట్ కొట్టింది తెలుగమ్మాయి అంజలి. ఇప్పటికే అక్కడ బాగానే సెటిల్ అయిపోయిన ఈ భామకు.. బోలెడంత డిమాండ్ ఉంది.
ఇక శ్రీదివ్య ది కూడా సేమ్ సిట్యుయేషన్. ఇక్కడ అవకాశాల్లేవు కానీ.. తమిళ్ లో స్టార్ అయిపోయింది. ఓ వారం క్రితం వచ్చిన రాయుడు మూవీతో మంచి హిట్ నే సాధించింది. అష్టాచెమ్మా భామ స్వాతి పరిస్థితి ఇదే. ఇక్కడ స్టార్లే కాదు, ఓ మోస్తరు హీరోలు కూడా ఛాన్సులివ్వరు కానీ.. తమిళ్ మాత్రం పెద్ద హీరోయిన్ అయిపోయింది. బిందుమాధవి కూడా తెలుగులోనే కెరీర్ స్టార్ట్ చేసి.. తర్వాత చెన్నైలో సెటిల్ అయిపోయింది. అదీ మన మూవీ మేకర్స్ స్పెషాలిటీ. తమిళం - మలయాళం హీరోయిన్స్ ను పట్టుకొచ్చి.. పక్కా తెలుగు నేటివిటీ అని చూపించేసి.. అదే నిజం అనుకోమంటున్నారు.