సహజంగా తమిళ్ సినిమా హీరోలు టాలీవుడ్ లో సత్తా చూడడం సంగతి తెలిసిందే. బాషా మూవీ తర్వాత రజినీకాంత్ కు ఇక్కడ కూడా బిగ్గెస్ట్ హీరో అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ స్థాయి విజయాలు అరుదుగా దక్కినా.. ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతూనే ఉంటాయి. ఇప్పటివరకూ అనేక మంది తమిళ హీరోలు మన దగ్గర మంచి మార్కెట్ ఏర్పరచుకోగా.. ఇప్పుడు తెలుగు హీరోలు తమిళ మార్కెట్ పై కన్నేశారు.
పెద్ద బడ్జెట్ తో తీసేందుకు.. తమ సినిమాల స్థాయి పెంచుకునేందుకు దర్శక నిర్మాతలు కూడా బైలింగ్యువల్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సిరీస్ తర్వాత ఇలా పక్క భాషలపై కన్నేయడం అనే కాన్సెప్ట్ బాగానే ఊపందుకుంది. అటు ప్రభాస్ తో పాటు ఇటు రానా సినిమాలకు కూడా తమిళ్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి.. రీసెంట్ గానే నాన్ అనైట్టాల్ పేరుతో తమిళ్ లో విడుదలైంది. మరో నాలుగు రోజుల్లో మహేష్ బాబు స్పైడర్ అయితే.. ప్రధానంగా తమిళ్ లోనే తెరకెక్కింది. తమిళ్ డైరెక్టర్ కావడంతో.. ఆ ఛాయలు ఎక్కువగానే కనిపిస్తున్నాయ్. మహేష్ బాబు కూడా పబ్లిసిటీ యాక్టివిటీస్ లో తమిళ్ కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు.
బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కూడా తమిళ్ లో మంచి ఆదరణనే పొందింది. ఇక రాబోయే చిత్రాల విషయానికి వస్తే మెగాస్టార్ నటిస్తున్న 151వ చిత్రం సైరా.. తమిళ్ తో పాటు పలు భాషల్లో రూపొందుతోంది. ప్రభాస్ నటిస్తున్న సాహో కూడా సేమ్ సిట్యుయేషన్. బాలయ్య-కేఎస్ రవికుమార్ ల చిత్రం కూడా తమిళ్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. మంచు మనోజ్ నటించిన ఒక్కడు మిగిలాడు చిత్రం.. కోలీవుడ్ లో నాన్ తిరుంబ వరువేన్ పేరుతో విడుదల కానుంది.
తమిళ్ మార్కెట్ ను దక్కించుకునే ప్రయత్నాలలో రామ్ చరణ్.. అల్లు అర్జున్.. నాగ చైతన్య.. నాని కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే.. ఇందుకు తమిళ్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుండడాన్ని గమనించాలి. ఇప్పటివరకూ సూర్య.. కార్తి.. ధనుష్ లాంటి తమిళ హీరోల సినిమాలు మనం చూస్తే.. మన సినిమాలు చూసేందుకు తమిళ్ జనాలు కూడా బాగానే ఉత్సాహం చూపిస్తున్నారు.