టాప్ స్టోరి: ఖాన్ ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తారా?

Update: 2019-08-21 05:34 GMT
ఇన్నాళ్లు బాలీవుడ్ అంటే ఖాన్ ల అడ్డాగా భావించేవారు. మ‌మ్మ‌ల్ని కొట్టే మొన‌గాళ్లు లేరు. మేమే తోపులం అనేట్టే ఉండేది అక్క‌డ సీను. కానీ ఇప్పుడు అంతా మారింది. బాహుబ‌లి మానియాతో ఖాన్ ల‌ను ఒక్క‌సారిగా త‌గ్గించేయ‌లేక పోయినా.. ఆ ప్ర‌భావం మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. బాహుబ‌లి త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి రికార్డులు కొట్టేయాల‌ని తంటాలు ప‌డిన మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అనుకున్న‌ది సాధించ‌లేక‌పోయారు. అమితాబ్ స‌హా భారీ కాస్టింగ్ తో అమీర్ చేసిన `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` దారుణంగా ఫెయిలైంది. ఇక ఇటీవ‌ల కింగ్ ఖాన్ షారూక్ సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లుగా నిలుస్తున్నాయి. కాలం క‌లిసి రావ‌డం లేదు. మ‌రోవైపు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన సినిమాలు స‌క్సెస్ సాధిస్తున్నా.. మ‌ధ్య‌లో వైఫ‌ల్యాలు ఎదుర‌వుతున్నాయి. స‌ల్మాన్ `భార‌త్` ఫ‌ర్వాలేద‌నిపించినా ఆశించినంత వసూళ్లు సాధించ‌లేదు.

ఈ బ్యాడ్ టైమ్ ఇలా ర‌న్ అవుతుంటే.. మ‌రోవైపు సైలెంటుగా సౌత్ నుంచి పోటీ అంత‌కంత‌కు ఠ‌ఫ్ గా మారుతోంది. హిందీ వాళ్లు హిందీ సినిమాలే చూడాల‌న్న రూల్ ని నెమ్మ‌దిగా మ‌నోళ్లు చెరిపేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి అనూహ్య‌మైన పోటీ ఎదుర‌వుతోంది. కేవ‌లం 2019లోనే రెండు భారీ టాలీవుడ్ చిత్రాలు హిందీ సినీప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్ గా మారాయి. ప్ర‌భాస్ న‌టించిన సాహో.. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా చిత్రాల ప్రీవిజువ‌ల్స్ చూశాక బాలీవుడ్ వాళ్ల‌కు మ‌తి  చెడింది. టీజ‌ర్- పోస్ట‌ర్- ట్రైల‌ర్- మేకింగ్ వీడియోలు ఇవ‌న్నీ చూశాక టాలీవుడ్ స‌త్తా ఏంటో తెలిసొస్తోంది. సాహో.. సైరాల‌కు ముంబై మీడియాలో హైప్ పెరిగింది. తెలుగు వాళ్లు క్రియేట్ చేసిన విజువ‌ల్స్ చూసి ఆహా ఓహో అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ ప‌రిణామం ఎంతో కొత్త‌ది. గ‌మ్మ‌త్త‌యిన‌ది. మ‌నోళ్ల‌కు కిక్కిచ్చేదేన‌ని చెప్పాలి. బాహుబ‌లి స్టార్ గా డార్లింగ్ ప్ర‌భాస్ క్రేజు అంత‌కంత‌కు పెరుగుతోందే కానీ త‌ర‌గ‌డం లేదు. ఇక ప్ర‌భాస్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ధీటుగా పోటీ స్పిరిట్ తో రామ్ చ‌ర‌ణ్ బృందం `సైరా` లాంటి భారీ చిత్రాన్ని తీయ‌డం అభిమానుల‌క గూస్ బంప్స్ తెస్తోంది.

ఇద్ద‌రు మెగాస్టార్(చిరు-అమితాబ్)లు క‌లిశారు.. అస‌లేం జ‌రుగుతోంది? అంటూ బాస్ చిరంజీవిని ముంబై మీడియా ప్ర‌శ్నించింది. మా అంద‌రి మెగాస్టార్ అమితాబ్ అంటూ త‌న‌దైన శైలిలో ఎంతో హుందాత‌నం ప్ర‌ద‌ర్శించారు మెగాస్టార్ చిరంజీవి. ఖాన్ ల‌ను కొట్టేస్తారా? అంటూ ప్ర‌భాస్ పై బాలీవుడ్ మీడియా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. ఖాన్ లు అంద‌రికీ దారి చూపించార‌ని విన‌మ్ర‌త‌ను చాటుకున్నాడు ప్ర‌భాస్. అయినా ఆ స్థాయి మ‌న‌కు ఉంద‌ని ప్రూవ్ చేస్తున్నారు డార్లింగ్ ప్ర‌భాస్. 250-350 కోట్ల బ‌డ్జెట్లు అంటూ సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తున్న టాలీవుడ్ నిర్మాత‌లు మునుముందు ఈ స్కేల్ ని అంత‌కంత‌కు పెంచుకుంటూ వెళుతున్నారు. ఇప్ప‌టికే రాజ‌మౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని 300 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నామ‌ని డీవీవీ దాన‌య్య ప్ర‌క‌టించారు. రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బాహుబ‌లి సిరీస్ సృష్టిక‌ర్త‌గా రాజ‌మౌళికి ఉన్న క్రేజు దృష్ట్యా ఈ సినిమాకి మార్కెట్ రేంజ్ జాతీయ స్థాయిలో అసాధార‌ణంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక వీట‌న్నిటినీ కొట్టేలా త‌దుప‌రి `అల్లు రామాయ‌ణం`కి 500-1000 కోట్ల రేంజ్ బ‌డ్జెట్ పెడుతున్నారన్న టాక్ కూడా ఉంది. ఇక అమీర్ ఖాన్ లాంటి స్టార్ 1000 కోట్ల బ‌డ్జెట్ తో `మ‌హాభార‌తం` తీస్తాన‌ని చెప్పి ప్ర‌య‌త్నం విర‌మించుకోవ‌డం తెలిసిందే. సౌత్ - నార్త్ గ్యాప్ త‌గ్గుతోంది. బాలీవుడ్ మీడియాకి ద‌క్షిణాది క‌నిపిస్తోంది. మీడియా క‌వ‌రేజీ పెరిగింది. ఈ ప‌రిణామాలు అన్నీ చూస్తుంటే ఖాన్ ల‌ను కొట్టేంత ద‌మ్ము సౌత్ కి ఉంద‌ని ప్రూవ్ అవుతోంది. చెమ‌ట‌లు ప‌ట్టించేయాలంతే!
    

Tags:    

Similar News