కామెంట్‌: సండే మధ్యాహ్నం కిక్కిచ్చారు

Update: 2016-04-03 15:30 GMT
టి 20 వరల్డ్‌ కప్‌.. ఫైనల్‌.. ఇండియా ఫైనల్‌ ఆడట్లేదు. కాని మనోళ్ళందరూ అయితే ఇంగ్లాండ్‌ లేకపోతే వెస్టిండీస్‌ టీమ్‌ లకు సపోర్టు ఇచ్చేసి.. టివిలకు అతుక్కుపోవడం.. పబ్‌ లలో పెద్ద పెద్ద స్ర్కీన్‌ ల ముందు తిష్టవేసేయడం.. అలా అలా ఎంజాయ్‌ చేయడానికి ఫిక్సయ్యారు. అయితే సండే మధ్యాహ్నమే ఉమెన్స్‌ టి20 ఫైనల్‌ కూడా ఉంది. ఆస్ర్టేలియా మహిళల జట్టుతో వెస్టిండీస్‌ మహిళల జట్టు తలబడుతోంది. ఇదంతా సరే.. ఇంతకీ తెలుగు సినిమా లవర్లకు ఎలాంటి ఎంటర్ టయిన్ మెంట్‌ ఉంది ఈ సండే?

అబ్బో.. చాలామంది తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు.. మాంచి కథలు రావట్లేదు అంటుంటారు కాని.. హెల్తీ కామెడీ అందించడంలో తెలుగు సినిమాలు దిట్ట. ఆదివారం మధ్యాహ్నం నుండి తెలుగు ఛానళ్ళన్నీ అటూ ఇటూ తిప్పుతుంటే.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. బొమ్మరిల్లు.. బ్రదర్స్.. ఢీ.. సాయంత్రం అయితే భలే భలే మగాడివోయ్‌... ఇలా మాంచి మాంచి సినిమాలే తెలుగు ఛానళ్ళలో వచ్చాయి. నిజానికి మ్యాచులకంటే ఈ సినిమాలే ఎక్కువగా కిక్కిచ్చాయి. ఎందుకంటే ఎమోషన్లు.. కామెడీ.. సెంటిమెంట్లు.. అన్నీ ఉన్నాయి ఈ సినిమాల్లో. మొత్తానికి ఈ సండే మధ్యాహ్నం అండ్‌ ఈవెనింగ్‌ అలా తెలుగు సినిమాలు అలరించాయి. ఎప్పటిలాగానే. తెలుగు సినిమాలు సూపర్‌ గురూ!!
Tags:    

Similar News