డిసెంబ‌ర్ రేస్‌ లో 20 సినిమాల క్యూ

Update: 2018-12-01 04:40 GMT
2.ఓ రిలీజైంది. చిట్టీ గురించి .. ప‌క్షిరాజు గురించి జ‌నం ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ వారం అంతా 2.ఓ రికార్డుల గురించి మాట్లాడుకుంటారు. ఆ త‌ర్వాత మాట్లాడుకోవ‌డానికేం ఉంది? అంటే.. కేవ‌లం ఈ డిసెంబ‌ర్‌ లో వ‌రుస‌గా 20 సినిమాలొస్తున్నాయి తెలుసా?  ఇందులో క్రేజు ఉన్న సినిమాలు ఓ అర‌డ‌జ‌ను ఉంటే - మిగ‌తా సినిమాల‌న్నీ ఎవ‌రికి వారు ఆశ నిరాశ‌ల మ‌ధ్య కొట్టుమిట్టాడుతూ.. అంత‌కుమించి ఏదో మ్యాజిక్ జ‌రుగుతుంద‌న్న‌ న‌మ్మ‌కంతో రిలీజ్ చేస్తున్న‌వే. జ‌నంలో వీటి గురించి డిస్క‌ష‌న్ ఇప్పుడు జ‌ర‌గ‌ప‌క‌పోయినా - రిలీజ్ త‌ర్వాత బావుంది అన్న టాక్ వ‌స్తే మాత్రం మాట్లాడుకునే ఛాన్సుంటుంది.

డిసెంబ‌ర్ 1న శ్రీ‌కాంత్ హీరోగా న‌టిస్తున్న ఆప‌రేష‌న్ 2019 రిలీజ‌వుతోంది. పొలిటిక‌ల్ బ్యాక్‌ డ్రాప్ మూవీ ఇది. డిసెంబ‌ర్ 7న ఏకంగా అర‌డ‌జ‌ను చిత్రాలు రిలీజ్ క్యూలో ఉన్నాయి. వీటిలో ఆర్జీవీ స‌మ‌ర్పిస్తున్న‌  భైర‌వ‌గీత‌ - బెల్లంకొండ హీరోగా న‌టించిన‌ క‌వ‌చం - సుమంత్ - సుబ్ర‌మ‌ణ్య‌పురం - సందీప్ కిష‌న్‌- నెక్ట్స్ ఏంటి? - బెక్కం- హుషారు - శుభ‌లేఖ‌లు చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. భైర‌వ‌గీత యాక్ష‌న్ ఫ్యాక్ష‌న్ బ్యాక్‌ డ్రాప్ - సుబ్ర‌మ‌ణ్య‌పురం థ్రిల్ల‌ర్ బ్యాక్‌ డ్రాప్ - క‌వ‌చం కాప్ డ్రామా .. ఈ సినిమాల లుక్‌ లు - టీజ‌ర్‌ లు ఆస‌క్తి పెంచాయి.

డిసెంబ‌ర్ 21న మూడు సినిమాల మ‌ధ్య ఠ‌ఫ్ ఫైట్ నెల‌కొంది. ఆ మూడు సినిమాల‌కు జ‌నాల్లో క్రేజు నెల‌కొంది. మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌- ఘాజీ సంక‌ల్ప్ రెడ్డి కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కుతున్న స్పేస్ బ్యాక్‌ డ్రాప్ మూవీకి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు స‌హా అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అలాగే శ‌ర్వానంద్ - సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ ప‌డి ప‌డి లేచే మ‌న‌సు పైనా యూత్‌ లో ఫాలోయింగ్ ఉంది. వీటితో పాటు క‌న్న‌డ హీరో య‌శ్ న‌టించిన కేజీఎఫ్ తెలుగు - త‌మిళం - క‌న్న‌డం - హిందీలో అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. కోలార్ బంగారు గ‌నుల్లో బానిస‌త్వం .. హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. అటుపై డిసెంబ‌ర్ 28న నిఖిల్ జ‌ర్న‌లిస్టుగా న‌టించిన ముద్ర రిలీజ‌వుతుంది. వీటితో పాటు రిలీజ్ తేదీల్ని ఖాయం చేసుకునే ప‌నిలో ఉన్న సినిమాలు మ‌రో 7-8 ఉన్నాయ‌ని తెలుస్తోంది. అంటే చిట్టీ వెంట మొత్తం 20సినిమాలు పైగానే క్యూలో ఉన్నాయి. అటుపై సంక్రాంతి రేసులో అతి పెద్ద పందెం ఉంటుంది. క‌థానాయ‌కుడు - విన‌య విధేయ రామా - ఎఫ్ 2 - పెట్టా వంటి భారీ చిత్రాలు క్యూలో ఉన్నాయి.
Tags:    

Similar News