సంక్రాంతి పండగ అంటేనే టాలీవుడ్ కి ఎంతో స్పెషల్. అల్లుళ్ల రాకతో తెలుగు లోగిళ్లలో ప్రత్యేక సందడి కనిపిస్తుంది. వారం పైగా స్కూళ్లు.. కాలేజ్ లకు సెలవు దినాలు కావడంతో అది బాక్సాఫీస్ కి కలిసొచ్చే పాయింట్. పెద్ద పండగ పేరుతో ఈ సీజన్ థియేటర్ల వద్ద సందడి మామూలుగా ఉండదు. ఇంటిల్లి పాదీ సినిమాలకు వెళ్లే సీజన్ గానూ దీనిని ట్రేడ్ రిజర్వ్ చేస్తుంది. సరిగ్గా ఇదే రీజన్ సంక్రాంతి సినిమాల మధ్య పోటీని పెంచుతుంది.
స్టార్ హీరోలు సంక్రాంతి రిలీజ్ కోసం ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రతిసారీ సంక్రాంతికి బిగ్ ఫైట్ ఉంటుంది. 2019లో నాలుగు భారీ చిత్రాలు రిలీజయ్యాయి. ఈసారి 2020 సంక్రాంతికి ఇదే తరహాలో ఠఫ్ కాంపిటీషన్ ఉందని అర్థమవుతోంది. సినిమాల ప్రారంభంలోనే సూపర్ స్టార్ మహేష్ .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ సంక్రాంతి రిలీజ్ ని ఖాయం చేసిన సంగతి తెలిసిందే. మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు.. అల్లు అర్జున్ నటిస్తున్న ఏఏ 19 సినిమాల్ని 2020 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.
ఈ విషయంలో అభిమానులకు తొలినుంచి ఫుల్ క్లారిటీ ఉంది. అయితే ఈరోజు `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో మహేష్ పాత్ర గురించి రివీల్ చేస్తూ దర్శకుడు అనీల్ రావిపూడి పర్టిక్యులర్ గా 2020 సంక్రాంతి రిలీజ్ ని ప్రస్థావించడం.. అటుపై గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు బరిలో దిగి అల్లు అర్జున్ సైతం 2020 సంక్రాంతి బరిలో కన్ఫామ్ గా వస్తున్నాడని ఓ పోస్టర్ ని రిలీజ్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. ఆ రెండూ సంక్రాంతి వార్ లో ఉన్న మాట వాస్తవం. ఈ సంగతి ముందే తెలిసిన అభిమానులకు ఓ రకమైన కన్ఫ్యూజన్ నెలకొంది. మహేష్ .. బన్ని మధ్య ఊహించని వార్ కి తెర లేచిందా? అన్న చర్చకు ఇది తావిస్తోంది.
ఆ ఇద్దరూ సంక్రాంతికి వస్తారు సరే.. పండగ బరిలో ఏఏ తేదీల్ని లాక్ చేశారు? అన్నది తేలాల్సి ఉంది. రెండు పెద్ద సినిమాల్ని ఒకేరోజు రిలీజ్ చేసే సాహసం నిర్మాతలు చేయరు. అయితే ఈ రెండు రిలీజ్ లకు మధ్య ఎంత ఎడం పాటిస్తారు? అన్నది కలెక్షన్స్ కి ఇంపార్టెంట్. ఓపెనింగ్ రికార్డులు.. తొలి వీకెండ్ రికార్డులు అంటూ ఫ్యాన్స్ రికార్డుల గురించి మాట్లాడాలంటే ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు రాకూడదు. తప్పని సన్నివేశంలో వచ్చేస్తే కలెక్షన్స్ ని షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి దీనిపై మహేష్ .. బన్ని నిర్మాతలే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆసక్తికరంగా సంక్రాంతి రేసులో రజనీకాంత్.. నాగార్జున లాంటి స్టార్లు ఉన్నారన్న మాట వినిపిస్తోంది. అంటే పోటీ గట్టిగానే ఉంది. పెద్ద సినిమాల రిలీజ్ ల కోసం థియేటర్ల పరమైన సర్ధుబాటు తప్పదేమో!!