హిందీ రాకపోయినా మనోడు చింపేశాడు

Update: 2017-04-03 04:39 GMT
ఆల్రెడీ తెలుగులో చాలా పాటలు పాడుతూ ఫ్యామస్ అయ్యాడు యంగ్ సింగర్ రేవంత్. మొన్ననే 'బాహుబలి' సినిమాలో మనోహరి అనే పాటను కూడా మనోడే పాడాడు. అయితే ఆల్రెడీ సింగర్ గా తెలుగులో తనకంటూ ఒక కెరియర్ ఉన్న ఈ విశాఖపట్నం కుర్రాడు.. బాలీవుడ్ వెళ్ళి అక్కడ ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు 9వ సీజన్ విజేతగా నిలిచాడు. హిందీ రాకపోయినా హిందీ పాటలు పాడేసి అబ్బురపరిచాడు.

నిజానికి రేవంత్ ఏమంటున్నాడంటే.. ''నాకు హిందీ సరిగ్గా మాట్లాడటం రాదు. అందుకే చాలామంది హైదరాబాదులో నన్ను వెటకారం చేశారు. ఇప్పుడు హిందీ పూర్తిగా నేర్చుకుని.. ఎలాగైనా బాలీవుడ్ లో పాటలు పాడి.. వారికి నా సత్తా ఏంటో చూపిస్తా'' అంటున్నాడు. పాతిక లక్షల ప్రైజ్ మనీ.. మరియు యునివర్సల్ మ్యూజిక్ వారి దగ్గర నుండి ఒక మ్యూజిక్ కాంట్రాక్ట్.. మనోడు సొంతం చేసుకున్నాడు. ఫైనల్ లో ఏకంగా 55% పబ్లిక్ ఓట్లు పొందిన రేవంత్ కుమార్ శర్మ.. తిరుగులేకుండా విన్నర్ అయిపోయాడనే చెప్పాలి.

కాకపోతే ఒక విషయం ఏంటంటే.. గతంలో ఇండియన్ ఐడల్ ట్రోఫీ గెలిచిన మరో తెలుగు సింగర్ శ్రీరామచంద్ర కూడా.. సింగింగ్ లో ఇరగదీస్తానంటూ.. చివరకు హీరో అయ్యి.. అటు పాటలు పాడకుండా ఇటు నటించకుండా.. అన్ని అవకాశాలు పోగొట్టుకున్నాడు. మరి రేవంత్ ఏం చేస్తాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News