బాహుబలికి పోటీగా టెర్మినేటర్‌ 3డి

Update: 2015-06-24 15:45 GMT
ఎస్‌.ఎస్‌.రాజమౌళి బాహుబలి చిత్రానికి పోటీగా టెర్నినేటర్‌ రంగంలోకి దిగుతున్నాడని 'తుపాకి' ముందే చెప్పింది. ఎట్టకేలకు అన్నంత పనీ జరిగింది. ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ కథానాయకుడిగా టెర్మినేటర్‌ సిరీస్‌లో తాజా చిత్రం బాహుబలి రిలీజ్‌(జూలై 10)కి సరిగ్గా వారం ముందు రిలీజవుతోంది.

జూలై 3న 3డి, 2డి రెండు వెర్షన్లలో ఈ చిత్రం రిలీజవుతోంది. వయాకామ్‌ 18 పిక్చర్స్‌ సంస్థ తెలుగు సహా హిందీ, తమిళ్‌, మలయాళంలో రిలీజ్‌ చేస్తోంది. టెర్మినేటర్‌ జెనిసిస్‌ ట్రైలర్‌కి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి 'టెర్మినేటర్‌ -మరో సృష్టి' పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. టెర్మినేటర్‌ సిరీస్‌లో ఇంతవరకూ చూడని వింత మాయాజాలం, భారీ యాక్షన్‌ ఈ చిత్రంలో ఉంటుందని చెబుతున్నారు. ఆర్నాల్డ్‌ మెషీన్‌ మేన్‌గా ఎలాంటి విన్యాసాలు చేశాడు? అన్నది చూడాలంటే ఐమాక్స్‌ 3డికి వెళ్లాల్సిందేనని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్నాల్డ్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణమిది. ఇటీవలి కాలంలో కాలిఫోర్నియా గవర్న్‌గా సేవలందించిన ఆర్నాల్డ్‌ ఈ చిత్రంతో ఘనమైన రీఎంట్రీ ఇస్తున్నాడనే అనుకోవాలి. అసలే హాలీవుడ్‌ సినిమాలు మన దగ్గర కూడా కోట్లు వసూలు చేస్తున్నాయి. ఫ్యూరియస్‌ 7, జురాసిక్‌ వరల్డ్‌.. ఇప్పుడు టెర్మినేటర్‌.. చూద్దాం మరి

Tags:    

Similar News