తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. రెగ్యులర్ షూటింగ్ జార్జియాలో మొదలు పెట్టారు. ఇటీవలే హీరో విజయ్ జార్జియా వెళ్లాడు. అక్కడ కీలకమైన షెడ్యూల్ ను ముగించుకుని తిరిగి చెన్నై చేరుకుంటారు. ఈ సినిమాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పీడ్ గా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తమిళ మీడియా వర్గాల వారు చెబుతున్నారు.
విజయ్ కరోనాకు ముందు ఏడాదికి రెండు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ఫుల్ జోష్ గా దూసుకు పోయేవాడు. కరోనా కారణంగా ఆయన సినిమాలపై ప్రభావం పడింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా వచ్చిన 'మాస్టర్' సినిమా తర్వాత మరో సినిమా విడుదలకు ఏదీ సిద్దంగా లేదు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో గత ఏడాది సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం చేస్తూ వచ్చారట. ఎట్టకేలకు ప్రారంభం అయిన ఈ సినిమా ను వెంటనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి వరకు విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చారు.
నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను అక్టోబర్ లేదా నవంబర్ వరకు పూర్తి చేసి వచ్చే ఆ వెంటనే మరో సినిమాను విజయ్ మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సూపర్ స్టార్ విజయ్ 2022 సంవత్సరంలో నెల్సన్ దిలీప్ సినిమాతో పాటు మరో సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. విజయ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా స్పీడ్ గా ఉంటాడు. ఆయన ప్రతి సినిమా వందల కోట్లను వసూళ్లు చేస్తున్న నేపథ్యంలో నిర్మాతలు ఆయనకు భారీ పారితోషికం ఇచ్చేందుకు సిద్దంగా ఉంటున్నారు. విజయ్ ఆరు నెలలకు ఒక సినిమా చొప్పున చేయాలనే పాలసీని పెట్టుకున్నాడు. కరోనా కారణంగా అది బ్రేక్ అయ్యింది. మళ్లీ ఈ ఏడాది నుండి దాన్ని ఫాలో అవ్వబోతున్నట్లుగా ఆయన అభిమానులు చెబుతున్నారు.