మన వాళ్లు వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మార్కెట్ పరిథిని పెంచుకుంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో రెడీ అయిపోతున్నారు. అయితే మన వాళ్లకు భిన్నంగా తమిళ హీరోలు మాత్రం తెలుగు మార్కెట్ పై కన్నేయడం ఆసక్తికరంగా మారింది. తెలుగులో ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య, కార్తి మంచి మార్కెట్ ని సృష్టించుకున్నారు. కానీ మిగతా హీరోలు మాత్రం ఆ స్థాయిలో మార్కెట్ ని సృష్టించుకోలేకపోతున్నారు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రాలు చేయాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది.
ఇప్పటికే ధనుష్ తెలుగు, తమిళ భాషల్లో `సార్` అనే మూవీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదే దారిలో తమిళ స్టార్ హీరో ఇళయళపతి విజయ్ కూడా త్వరలో ద్వి భాషా చిత్రాన్ని చేయబోతున్నారు. పోలీసోడు, మెర్సల్, మాస్టర్ చిత్రాలు తెలుగులో మంచి విజయాల్ని సాధించడంతో విజయ్ కూడా తెలుగు మార్కెట్ పై కన్నేశాడు. ఇందులో భాగంగా స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో ఓ భారీ ద్వి భాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
శంకర్ - చరణ్ లతో ప్రస్తుతం పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు కూడా. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి రాబోతోందంటూ వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి బయటికి వచ్చేసింది.
ఈ చిత్రాన్ని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిపోవడంతో దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ భారీ ప్రాజెక్ట్ ని త్వరలో పూర్తి చేయాలనే ఆలోచలో వున్నారట. విజయ్ నటించిన `బీస్ట్` ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వంశీ పైడిపల్లి మూవీని హీరో విజయ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. అన్నీ కుదరడంతో యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఏప్రిల్ మొదటి వారంలో లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు వున్నట్టుగా తెలిసింది.
ఇందులో విజయ్ కి జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశం వుందని, ప్రకాష్ రాజ్ ఇందులో కీ రోల్ పోషించబోతున్నారట. భారీ బడ్జెట్ తో తెరపైకి రానున్న ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విశేషాల్ని నిర్మాత దిల్ రాజు త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించబోతున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.