అఖండ.. భీమ్లా నాయక్ సినిమాలతో మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు తమన్ ఇప్పుడు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా తో క్లాస్ ఆడియన్స్ ని మైమరిపించేందుకు సిద్ధమయ్యాడు. రాధేశ్యామ్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన తమన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమా పాటల సంగీతాన్ని బాలీవుడ్ సంగీత దర్శకులు అందించారు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ తో యు.వి.క్రియేషన్స్ వారు చేయించారు.
యూవి వారికి తమన్ పై ఉన్న నమ్మకం ఏంటో దీంతో అర్థమైంది. తమన్ ఈ సినిమాకు మంచి క్లాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడని సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఆయన చేసినవన్నీ మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. కానీ ఈసారి మాత్రం పూర్తి క్లాస్ తరహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను రాధేశ్యామ్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు వర్క్ చేయడం ద్వారా తాను యు.వి.క్రియేషన్స్ వారి రుణం తీర్చుకునే అవకాశం దక్కిందని తమన్ ఎమోషనల్ అయ్యాడు.
ఇది తాను యు.వి.క్రియేషన్స్ కు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అన్నట్లుగా పేర్కొన్నాడు. తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో యువి క్రియేషన్స్ వారు భాగమతి మరియు మహానుభావుడు సినిమాల ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాల వల్ల నాకు వరుణ్ తేజ్ హీరోగా నటించిన తొలి ప్రేమ సినిమాకి సంగీతాన్ని అందించే ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత వరుసగా త్రివిక్రమ్ గారి తో సినిమాలు చేసే అవకాశాలు దక్కాయి.
పెద్ద సినిమాలు స్టార్ హీరోల సినిమాలు చేసే అవకాశం యూవి వారు ఇచ్చిన అవకాశం వల్లే వచ్చాయంటూ తమన్ పేర్కొన్నాడు. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారు సహాయం చేశారు కనుక ఈ సినిమా తో వారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తమన్ పేర్కొన్నాడు. ఈ అవకాశంను తమన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. మరి రాధేశ్యామ్ సినిమా సక్సెస్ లో ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ స్థాయిలో ప్రాముఖ్యత దక్కించుకుంటుంది అనేది చూడాలి.
ప్రభాస్ సినిమా కు మొదటి సారి అది కూడా పాన్ ఇండియా సినిమా కు మొదటి సారి తమన్ సంగీతాన్ని అందించాడు. కనుక ఈ సినిమా ఆయన కెరీర్ లో కీలకం అయ్యే అవకాశం ఉంది. రాధేశ్యామ్ బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. కనుక అక్కడ ఆఫర్లు రావాలంటే తమన్ కు ఈ సినిమా బీజీఎం సక్సెస్ చాలా కీలకం. అందుకే ది బెస్ట్ ఔట్ పుట్ ను తమన్ ఇచ్చి ఉంటాడు అనిపిస్తుంది.