పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సంగీత స్వరం రమణగోకుల కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ హిట్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పవన్ కెరీర్ ఆరంభంలో గోకుల సంగీత సారథ్యంలోనే ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. అప్పట్లో పవన్ సినిమాకి రమణ గోకుల సంగీతమంటే ఓ బ్రాండ్. పవన్ అంటే రమణ గోకుల. గోకుల అంటే పవన్ అన్నంతగా ఫేమస్ అయ్యారు.
ఆ స్థాయిలో ఎన్నో మ్యూజికల్ హిట్ చిత్రాల్ని ప్రేక్షకులకి అందించారు. 'తమ్ముడు'..'బద్రీ'..'జానీ'.. 'అన్నవరం' ఇలా ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ అయినవే. రిలీజ్ కి ముందుగానే మ్యూజికల్ గా హిట్ అందుకోవడం ఆ కాఆంబినేషన్ ప్రత్యేకతగా నిలిచింది. వీటన్నింటిలో 'తమ్మడు' సక్సెస్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.
పవన్ కెరీర్ లో 'తమ్ముడు' మైల్ స్టోన్ మూవీ. పవన్ కి యూత్ లో క్రేజ్ ని పెంచిన చిత్రమిది. కమర్శియల్ సక్సెస్ తో పాట విమర్శకుల ప్రశంసలందుకుంది. పవన్ బీఫోర్ సినిమా జీవితానికి- తమ్ముడు కథ దగ్గరగా ఉంటుందని అంటుంటారు. శ్రీ వెంకటేశ్వరా ఆర్స్ట్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించారు.
1999 జులై 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిగ్గా నిన్నటి 15 వ తేదీ శుక్రవారంకి సినిమా విడుదలై 23 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రమణగోకుల 'తమ్ముడు' జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. 'ఏదోలా ఉంది నాలో వేళ ఈ వింత ఏమిటో' పాటకి గిటార్ వాయించి అభిమానం చాటుకున్నారు.
ఈసందర్భంగా ట్విటర్ వేదికగా స్పందించారు. 'అప్పుడే తమ్మడు రిలీజ్ అయి 23 ఏళ్లు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నాను' అని తెలిపారు. ప్రస్తుతం రమణ గోకుల వీడియో పవన్ అభిమానుల్లో వైరల్ గా మారింది. మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుండు అని అభిమానులు కోరు కుంటున్నారు. మరి పవన్ తన మ్యూజిక్ సంచలనానికి అవకాశం కల్పిస్తారేమో చూడాలి.
రమణ గోకుల చివరిగా '1000 అబద్దాలు' సినిమాకి సంగీతం అందించారు. ఆ సినిమా విడుదలై పదేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఆయనకి అవాకాశాలు రాలేదు. కానీ టాలీవుడ్ పై అభిమానం మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటారు.
Full View
Full View Full View Full View Full View