థాంక్యూ మూవీ క్రేజీ అప్డేట్..!

Update: 2021-04-25 02:30 GMT
తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ పాత్రలకు మొదటి ప్రిఫెరెన్సుగా దర్శకులు అక్కినేని ఫ్యామిలీ హీరోల వైపే చూస్తారు. ఎందుకంటే నాగేశ్వర్రావు దగ్గర నుండి నేటి అఖిల్ వరకు అందరూ లవర్ బాయ్స్ గా జనాలు పిలుచుకున్నారు. అయితే మొన్నటివరకు లవర్ బాయ్ పాత్రల్లో అలరించిన అక్కినేని హీరో నాగచైతన్య. సవ్యసాచి సినిమా నుండి డిఫరెంట్ స్టోరీలతో, డిఫరెంట్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. సవ్యసాచికి ముందు చైతూ లవర్ బాయ్.. కానీ మజిలీ సినిమాతో తన పంథా మార్చాడు. మజిలీ సినిమాలో నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని అక్కినేని హీరోలలో నాగచైతన్య ఒక్కడే సక్సెస్ రేటు మెయింటైన్ చేస్తున్నాడు.

ఇకనుండి ప్రతి సినిమాను డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాడేమో చూడాలి. నిజానికి మజిలీ వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. అప్పటినుండి నాగచైతన్య నుండి ఏ ఒక్క సినిమా రాలేదు. ఇటీవలే క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేసాడు. త్వరలోనే ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే లవ్ స్టోరీ మూవీ లైన్ లో ఉండగానే చైతూ.. 'మనం' ఫేమ్ విక్రమ్ కే కుమార్ తో థాంక్యూ సినిమా ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం సిద్ధం అవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. థాంక్యూ టీమ్ సెకండ్ షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేసినట్లు టాక్. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ కాగా దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నాడు.
Tags:    

Similar News