యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ `కార్తికేయ 2`. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీని 2014లో వచ్చిన `కార్తికేయ`కు సీక్వెల్ గా రూపొందించారు. అయితే పార్ట్ 2ని ద్వారాక రహస్యాలని అన్వేషించే ఓ మెడికో నేపథ్యంలో తెరకెక్కించడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్నడ్డాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
అయితే ఈ మూవీ టీమ్ గోల్డెన్ ఆఫర్ ని కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ముందు ఈ మూవీని జూలై 22న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇదే రోజున నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మించిన `థాంక్యూ` రిలీజ్ అవుతుండటం, నిర్మాత దిల్ రాజు `కార్తికేయ 2` టీమ్ ని రిలీజ్ డేట్ మార్చుకోమని చెప్పడంతో ఆయన మాట కాదనలేక రిలీజ్ డేట్ ని ఆగస్టు కు మార్చేశారు. ఇలా చేసి ఎంత పెద్ద తప్పు చేశారో. ఎలాంటి గోల్డెన్ ఛాన్స్ ని మిస్సయ్యారో ఇప్పుడు కార్తికేయ 2 టీమ్ కు స్పష్టమవుతోందట.
రిలీజ్ డేట్ ని త్యాగం చేసినా `థాంక్యూ` టీమ్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. తొలి రోజే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేసింది. ఇక మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ ఈ సినిమాకు దారుణ అనుభవం ఎదురవుతోంది. జనాలు రాకపోవడంతో షోలు క్యాన్సిల్ చేసే దారుణ పరిస్థితి తలెత్తడం గమనార్హం. పబ్లిసిటీ సరిగా లేకపోవడం, ఆశించిన స్థాయిలో ప్రమోషన్స్ లేకపోవడం.. ప్రధానంగా ఆడియన్స్ ని కట్టిపడేసే కంటెంట్ లేకపోవడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది.
మూడు రోజులకు నాలుగు కోట్ల షేర్ ని కూడా రాబట్టలేకపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే రోజు విడుదలైన బాలీవుడ్ మూవీ `షంషేరా` దారుణంగా ఫ్లాప్ అయింది. బాలీవుడ్ లో పేరున్న యష్ రాజ్ ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ఆ సంస్థకు కోట్లల్లో నష్టాలని మిగిల్చిబోతోంది. వంద కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. నామ మాత్రపు వసూళ్లని కూడా ఈ సినిమా రాబట్టే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు ఘంటాపధంగా చెబుతున్నాయి. ఈ రేంజ్ లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించి వుండరు.
ఇక గత వారం వచ్చిన `ది వారియర్` కూడా ఆల్ మోస్ట్ చేతులు ఎత్తేయడంతో కామన్ ఆడియన్ చూడాలనుకున్న సినిమా ఏదీ థీయేటర్లలో లేకుండా పోయింది. ఇదే సమయంలో `కార్తికేయ 2` గనక అనుకున్న సమయానికే రిలీజ్ అయి వుంటే రికార్డుల మోత మోగించేది. ప్రేక్షకులు బలమైన కంటెంట్ వున్న సినిమా కావడంతో బ్రహ్మరథం పట్టేవారు. మరి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని చేజేతులా ఎందుకు జారవిడుచుకున్నారని `కార్తికేయ 2` టీమ్ పై కామెంట్ లు పడుతున్నాయి.
ఇంత మంచి ఛాన్స్ ని వదులుకుని భారీ పోటీ వున్న ఆగస్టు 12ని ఎంచుకుని పెద్ద తప్పు చేశారని ఫ్యాన్స్ వాపోతున్నారట. `కార్తికేయ 2` టైమ్ లో అమీర్ ఖాన్ మూవీ `లాల్ సింగ్ చద్దా` ఆగస్టు 11న విడుదలవుతోంది. ఇక ఇదే ఊపులో నితిన్ ఆగస్టు 12నే `మాచర్ల నియోజక వర్గం`తో వచ్చేస్తున్నాడు. టీజర్, అంజలి ఐటమ్ సాంగ్, మంగళవారం విడుదల చేసిన `ధమ్కీ` సినిమాపై అంచనాల్ని పెంచేసి గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంది. మరి ఇంత టఫ్ పోటీని తట్టుకుని `కార్తికేయ 2`ని నిఖిల్ ఎలా ఒడ్డున పడేస్తాడో వేచి చూడాలి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.