కరోనా పుణ్యమా అని థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితి మారిపోయింది. థియేటర్లు మూతపడటంతో ఓటీటీలే శరణ్యం అయ్యాయి. ఉన్న ఓటీటీ స్ట్రీమింగ్ సేవలు పుంజుకుంటే, కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. అలా వచ్చిందే ఆహా. ఏకైక తెలుగు ఓటీటీ ప్లాట్ఫారమ్ గా మంచి ప్రాచుర్యం పొందింది.
వైవిధ్యమైన కంటెంట్ అందించడంలో ముందుండే ఆహా, మరో వైవిధ్యమైన సీరీస్ ప్రకటించింది. టీవీఎఫ్ రూపొందించిన ‘ఫ్లేమ్స్’ సిరీస్ రీమేక్ గా 'తరగతి గది దాటి' ప్రకటించింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ‘తరగతి గది దాటి' టీనేజర్ల మధ్య సాగే ప్రేమ కథ. హర్షిత్ రెడ్డి, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, నిఖిల్ దేవాదుల ముఖ్య పాత్రలో మెరవనున్నాడు.
‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ తెరకెక్కించిన మల్లిక్ 'తరగతి గది దాటి' కి దర్శకత్వం వహిస్తున్నాడు. 5 ఎపిసోడ్ల నిడివి ఉండే వెబ్ సీరిస్, రాజమండ్రి నేపథ్యంలో ఉండబోతుంది. ఈ రీమేక్ వెబ్ సిరీస్ ని తెలుగు నేపధ్యానికి తగ్గట్టుగా మార్పులు చేసినట్టుగా సమాచారం. తరగతి గది దాటి విడుదల తేదీ తెలియాల్సి ఉంది.
ఇతర భాషల్లో విజయవంతమైన సినిమాలను కూడా ఆహా అందిస్తుంది. ఇటీవల విడుదలైన ‘కుడి ఎడమైతే మంచి విజయాన్ని అందుకుంది. 'తరగతి గది దాటి' వెబ్ సీరీస్ తో అలంటి అద్భుతాన్నే చేయగలదేమో చూడాలి.