ప్రభాస్ - సుజీత్ కాంబినేషన్ మూవీ `సాహో` ఆగస్టు 15 నుంచి 30వ తేదీకి వాయిదా పడిందంటూ నిన్నటి సాయంత్రం మీడియాలో కథనాలొచ్చాయి. దీంతో డార్లింగ్ ప్రభాస్ అభిమానుల్లో తీవ్ర నిరాశ తప్పలేదు. అయితే ఈ వాయిదా విజువల్ గా క్వాలిటీ పెంచేందుకేనన్న ముచ్చటా సాగుతోంది. వీఎఫ్ ఎక్స్ సహా కీలకమైన కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నాణ్యత పెంచేందుకు సాహో టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇకపోతే వీళ్లు క్వాలిటీ పెంచాలనుకుంటున్నది ఎందులో? అంటే.. ఈ సినిమాలో 3 గంటల నిడివిలో ఏకంగా 20-40 నిమిషాల పాటు కళ్లు తిప్పుకోనివ్వని భారీ యాక్షన్ సీక్వెన్సులు కట్టి పడేస్తాయని చెబుతున్నారు. అందులో ఎనిమిది నిమిషాల పాటు దుబాయ్ నేపథ్యంలోని గుక్క తిప్పుకోనివ్వని భారీ యాక్షన్ ఎపిసోడ్ ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుందట. ఇప్పటికే దానికి సంబంధించిన విజువల్స్ ని మేకింగ్ వీడియోలు.. టీజర్ లోనూ రివీల్ చేశారు. ప్రభాస్ - నీల్ నితిన్ సహా భారీ ఫైటర్లపై తెరకెక్కించిన ఛేజ్- యాక్షన్ దృశ్యమిది. దీనికోసం ఏకంగా 90 కోట్లు ఖర్చు చేశారని ఇదివరకూ ప్రచారమైంది. అయితే ఈ సన్నివేశానికి ఎగ్జాక్ట్ గా 70 కోట్ల మేర ఖర్చయ్యిందని తాజాగా ఓ సన్నిహిత సోర్స్ ద్వారా రివీలైంది. దుబాయ్ అబుదబీలో అత్యంత ఖరీదైన లొకేషన్లలో ఫ్లైఓవర్ పైనా ఈ ఎపిసోడ్స్ ని తెరకెక్కించేందుకు యువి క్రియేషన్స్ సంస్థ ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసింది.
ఇక సాహో క్లైమాక్స్ లో ఉత్కంఠ రేకెత్తించే యాక్షన్ సీన్స్ మైమరిపించనున్నాయట. సినిమా ఆద్యంతం 40 నిమిషాల పాటు యాక్షన్ కే ప్రాధాన్యతనిచ్చారని తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ కి వీఎఫ్ ఎక్స్ ని జోడించి విజువల్ గ్లింప్స్ ని పెంచేందుకు ప్రస్తుతం టీమ్ వర్క్ చేస్తోంది. గంట పైగా మూవీ లో లవ్ .. ఎమోషన్స్ పైనా సుజీత్ కాన్ సన్ ట్రేట్ చేశారట. అబూదబీ యాక్షన్ సీన్ కి 70కోట్లు ఖర్చయితే ఇతరత్రా యాక్షన్ సీన్లకు అందుకు డబుల్ ఖర్చయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కించిన ఇంటర్వెల్ యాక్షన్ సీన్ కి ఏకంగా 30 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇప్పటికే యువి సంస్థ 250-300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసిందని ప్రచారం సాగుతోంది. ఇక ఈ చిత్రంలో భారీ కాస్టింగ్ .. యాక్షన్ కొరియోగ్రాఫర్లకు అంతే భారీగా పారితోషికాలు ఇస్తున్నారట. ట్రాన్స్ ఫార్మర్స్ ఫేం కెన్నీ బేట్స్ కి భారీ మొత్తం పారితోషికంగా ముట్ట జెబుతున్నారన్న సంగతి రివీలైంది.