అందుకే జక్కన్న 'మాస్టర్ స్టోరీ టెల్లర్'..!

Update: 2021-11-02 11:31 GMT
బాహుబలి' సినిమా డేటా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ''ఆర్.ఆర్.ఆర్''. ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్టన్ డ్రామా కోసం సినీ అభిమానులు ఆతృతగా వేచి చూస్తున్నారు. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందుగానే తనదైన శైలిలో జక్కన్న ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు.

ఇప్పటికే RRR హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రలకు సంబంధించిన ఇంట్రో వీడియోలు.. అజయ్ దేవగన్ - అలియా భట్ - ఒలివియా మోరిస్ లుక్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్టుగా సినిమా నేపథ్యం మీద హింట్ ఇస్తూ ఓ గ్లిమ్స్ ని విడుదల చేశారు. 45 సెకండ్ల పాటు ఉన్న ఈ వీడియో అనూహ్య స్పందన తెచ్చుకుంటోంది.

రాజమౌళి సినిమా నుండి వచ్చే ఏ కంటెంట్ అయినా గూస్ బమ్స్ తెప్పించే రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు RRR గ్లిమ్స్ కూడా అదిరిపోయింది. అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో విజువల్ ట్రీట్ అందించాడు. అంతేకాదు ఈ చిన్న వీడియో ద్వారా సినిమాలోని కొన్ని సంఘటనలు రివీల్ చేసి త్రిపుప్ ఆర్ బ్యాక్ డ్రాప్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు.

సినిమా విడుదలకు ముందే మొత్తం కథను వివరించి.. వెండి తెర మీద తనదైన కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడం రాజమౌళి స్టైల్. గత కొన్నేళ్లుగా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. ఇప్పుడు RRR విషయంలో కూడా అదే చేస్తున్నారు. సినిమా ప్రారంభం కాకముందే ఈ సినిమా కథేంటో జక్కన్న చెప్పేసారు.

అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ వంటి ఇద్దరు విప్లవవీరులు స్వాతంత్రోద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనక ముందు ఎక్కడ ఉన్నారు.. ఏమి చేశారు అనేది చరిత్రకారులు చెప్పలేదు. ఆ సమయంలో ఒకవేళ వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుందని ఊహించి రాసిన కల్పిత కథతో RRR సినిమా రూపొందించనున్నట్లు రాజమౌళి చెప్పారు. అయితే గ్లిమ్స్ చూస్తుంటే జక్కన్న పీరియాడికల్ నేపథ్యంలో ఓ భారీ ఇంటెన్స్ డ్రామాని ప్రేక్షకులకు చూపించబోతున్నట్లు అర్థం అవుతోంది.

ఎలాంటి డైలాగ్స్ లేకుండానే ఓ చిన్న వీడియోతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో రాజమౌళి చూపించారు. హీరోహీరోయిన్లతో పాటుగా మిగతా ప్రధాన పాత్రలకు కూడా ఇందులో భాగం కల్పించారు. బాహుబలి తరహాలో భారీ సెట్టింగులు.. దానికి తగ్గ యాక్షన్ సీక్వెన్స్.. ఎమోషన్స్.. హీరోల ఎలివేషన్స్.. ఇలా అన్ని అంశాలు 45 సెకండ్లలో చూపించారు.

అలాగే పోలీసుగా చెర్రీ - బందిపోటుగా ఎన్టీఆర్ ఇంటెన్స్ పాత్రలు.. ఎన్టీఆర్ ను పులి వెంబడించడం.. చరణ్ గుర్రం మీద - తారక్ బైక్ మీద వెళ్లే ఛేజింగ్.. ఇద్దరూ బ్రిడ్జి మీద నుంచి నదిలో దూకే సీక్వెన్స్.. బ్రిటీష్ వారి మీద భారతీయులు తిరగబడటం వంటివి RRR గ్లిమ్స్ లో రాజమౌళి చూపించారు.

హీరోల క్యారెక్టరైజేషన్ - RRR బ్యాక్డ్రాప్ - మెయిన్ సీన్స్ వెల్లడిస్తూ.. తన స్క్రీన్ ప్లే తో 1920ల కాలం నాటి ఓ భారీ పోరాటాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నట్లు రాజమౌళి చెప్పకనే చెప్పారు. ఓ చిన్న గ్లిమ్స్ ఈ స్థాయిలో ఉంటే.. ట్రైలర్ ఎలా ఉంటుందో.. సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు.

ఇకపోతే సోమవారం విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. మిలియన్స్ వ్యూస్ - లక్షల కొలదీ లైక్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. RRR గ్లిమ్స్ కు వస్తోన్న భారీ రెస్పాన్స్ కు చాలా సంతోషంగా ఉంది.. సినీ పరిశ్రమలోని ఎందరో స్నేహితులు, అభిమానులు పంపిన సందేశాలకు ధన్యవాదాలు. చిత్ర బృందం మొత్తం ఈ స్పందన చూసి ఖుషీ అవుతోంది అని రాజమౌళి ట్వీట్ లో పేర్కొన్నారు.
Tags:    

Similar News