ఆ క్ష‌ణంతో పొట్టి డ్రెస్ ల‌కు సాయి ప‌ల్ల‌వి నో చెప్పింద‌ట‌

Update: 2022-06-13 12:32 GMT
మ‌ల‌యాళ చిత్రం 'ప్రేమ‌మ్‌'లో మ‌ల‌ర్ గా న‌టించి ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది సాయి ప‌ల్ల‌వి. ఆ త‌రువాత తెలుగులో 'ఫిదా' మూవీతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాకే త‌న‌కు తెలుగు ప్రేక్ష‌కులంతా ఫిదా అయ్యేలా చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాని ఎంజాయ్ చేస్తున్న సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం న‌టిస్తున్న మూవీ 'విరాట‌ప‌ర్వం'. రానా హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల తెర‌కెక్కించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌. ఎల్‌. వి. సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు.

1992 కాలంలో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని జూన్ 17న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి ప‌ల్ల‌వి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. ఇంత వ‌ర‌కు చేసిన పాత్న‌ల‌న్నీ త‌న‌కు సంతృప్తినిచ్చాయ‌ని. ఇక కెరీర్ ఆపేయాల‌ని అనిపించిన సంద‌ర్భంలో డాక్ట‌ర్ వృత్తిని ప్రారంభిస్తాన‌ని తెలిపింది.

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ లు ఎంతో మంది వున్నా.. వారంద‌రికి భిన్నంగా ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయ‌కుండా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల్లో న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకుంది. అయితే తాను ఎందుకు ఎక్క‌స్ పోజింగ్ కి దూరంగా వుంటోందో.. తాజాగా వివ‌రించింది సాయి ప‌ల్ల‌వి. 'మాది సంప్ర‌దాయ‌ కుటుంబం. మా నాన్న సెంట్ర‌ల్ గ‌ర‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగి. నాకొక చెల్లి వుంది. ఇంట్లో వున్న‌ప్పుడు మేమిద్ద‌రం ష‌టిల్ ఆడుతాం. ఆ స‌మయంలో సౌక‌ర్యంగా వుండేలా పొట్టి దుస్తులే వేసుకుంటాం.

అయితే సినిమాల్లోకి అడుగుపెట్టిన స‌మ‌యంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న కార‌ణంగా సినిమాల్లో పొట్టి డ్రెస్ లు వేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నా. వైద్య విద్య నేర్చుకోవ‌డానికి జార్జియా వెళ్లిన‌ప్పుడు అక్క‌డ టాంగో డాన్స్ నేర్చుకున్నాను. టాంగో డాన్స్ నేర్చుకోవాలంటే అందుకు త‌గ్గ డ్రెస్ మాత్ర‌మే వేసుకోవాలి. అదే విష‌యాన్ని అమ్మా నాన్న‌ల‌కు వివరించి వారు ఓకే అన్నాకే ఆ డాన్స్ నేర్చుకున్నాను. ఆ త‌రువాత కొన్నాళ్ల‌కే 'ప్రేమ‌మ్‌'లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అంద‌రు ప్ర‌శంసించారు.

అదే స‌మ‌యంలో నేను జార్జియాలో చేసిన టాంగో డాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నెటిజ‌న్ లు ఆ వీడియోపై కామెంట్ చేసిన విధానం నాకు బాధ క‌లిగించింది. ఆ క్ష‌ణం నుంచి పొట్టి డ్రెస్ ల‌కు నో చెప్ప‌డం మొద‌లు పెట్టా' అని తెలిపింది సాయి ప‌ల్ల‌వి.

Full View

Tags:    

Similar News