ఏపీలో టిక్కెట్టు ధరలు టాలీవుడ్ నిర్మాతలకు కునుకుపట్టనివ్వని సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ నలుగురు లేదా ఆ పదిమందికి ఇది మింగుడుపడనిది. సినీపెద్దలు సైతం ఎంతగా బతిమాలినా ఏపీ ప్రభుత్వం దిగి రాదు. చివరికి కోర్టులు కూడా అధికారులు జగనన్న చేతికే అస్త్రం ఇవ్వడంతో ఎక్కే చెట్టు దిగే చెట్టులా అయ్యింది పరిస్థితి.
కానీ కాలం అన్నిటినీ మార్చేస్తుంది. ఇప్పటికి ప్రభుత్వం దిగొచ్చే వీలుందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో తెలుగు చిత్ర పరిశ్రమకు అత్యంత సానుకూల వార్తను అందించే అవకాశం ఉందని తాజా కథనాలు సూచిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అతి త్వరలో ఫ్లెక్సిబుల్ సినిమా టిక్కెట్ ధరల విధానాన్ని అనుమతించే అవకాశం ఉంది. దీనిని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.
ప్రభుత్వం ఫ్లెక్సిబుల్ టిక్కెట్ ధరలను అనుమతించడానికి సిద్ధంగా ఉంటే అది నిజంగా పరిశ్రమకు వరం లాంటిది. మునుపటిలా పెద్ద సినిమాలకు టికెట్ ధరల్ని పెంచుకునే వీలుంటుంది. సాధ్యమైనంత తొందర్లోనే అధికారిక సినిమా టిక్కెట్ రేట్లు ప్రకటిస్తారనే ఆశిస్తున్నారు.
మునుముందు రాధేశ్యామ్ - ఆర్.ఆర్.ఆర్ - భీమ్లా నాయక్- సర్కార్ వారి పాట సహా ఎన్నో భారీ చిత్రాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. తాజా పరిణామం బిగ్ బూస్ట్ అనే చెప్పాలి.