`గల్లీ బోయ్`(2019) ఫేం జోయా `ది ఆర్చీస్` సిరీస్ కి భారతీయ వెర్షన్ ని రూపొందిస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో నటవారసులు పరిచయమవుతుండడం మరింత ఉత్కంఠను కలిగిస్తోంది. జోయా అక్తర్ OTT చిత్రం `ది ఆర్చీస్`ని ప్రకటించినప్పటి నుండి అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.
ఈ సినిమాతో ముగ్గురు స్టార్ కిడ్స్ అరంగేట్రం చేస్తుండడంతో క్యూరియాసిటీ నెలకొంది. షారూఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్... బోనీ కపూర్ కుమార్తె ఖుషీ కపూర్ - అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా ఈ చిత్రంతో OTT అరంగేట్రం చేయనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలై వైరల్ అయ్యాయి. ఆర్చీ కామిక్స్ సృష్టికర్త జోన్ గోల్డ్ వాటర్ తో జోయా అక్తర్ సంభాషిస్తున్న వీడియోని కూడా రిలీజ్ చేయగా ఇటీవల వైరల్ గా మారింది. చిన్నప్పటి నుంచి తాను చదివిన కామిక్ బుక్స్ సిరీస్ నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని(సిరీస్ ని) రూపొందిస్తున్నానని జోయా అన్నారు.
ఎట్టకేలకు `ది ఆర్చీస్` సిరీస్ చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. పాపులర్ అంతర్జాతీయ కామిక్ సిరీస్ లో నటవారసుల ఆరంగేట్రం ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్కంఠ నడుమ తాజా ప్రకటన మరింత ఆసక్తిని పెంచింది. నిజానికి భారతీయ వెర్షన్ లాంచింగ్ దశ నుండి జోయా అభిమానులు ఈ చిత్రం కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు షూటింగ్ పూర్తి కావడంతో త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ ని వీక్షించాలన్న కుతూహాలం పెరిగింది.
తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇండియా అధికారిక ఇన్ స్టాలో ది ఆర్చీస్ తారాగణం సిబ్బంది జాలీగా సెలబ్రేట్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసుకుంది. టాకీ పూర్తయిన అనంతరం యువ నటీనటులతో జోయా కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేసారు. స్టార్ కిడ్స్ తో పాటు ఈ చిత్రంలో వేదంగ్ రైనా- యువరాజ్ మెండా- మిహిర్ అహుజా- డాట్ కూడా నటిస్తున్నారు. ఈ ఫోటోల్లో ది ఆర్చీస్ టైటిల్ తో ఉన్న ఆకుపచ్చ -మెరూన్ టీ-షర్టులను ధరించి కనిపించారు. తారాగణంతో గ్రూప్ ఫోటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేక్ -క్లాప్ బోర్డ్ ఉన్న ఫోటోలను కూడా ఇన్ స్టా పోస్ట్ లో షేర్ చేసారు. దర్శకురాలితో పాటు సుహానా- ఖుషీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ ఫీచర్ గా దీనిని పోస్ట్ చేసారు. చిత్రీకరణ ముగిసింది.. అంటూ ఎమోషనల్ ఈమోజీని..రెడ్ హార్ట్ ఎమోజీని సుహానా పోస్ట్ చేయగా.. ఖుషీ వైట్ హార్ట్ ఈమోజీతో తన ఉద్వేగాన్ని రివీల్ చేసింది.
`ది ఆర్చీస్`ను ఆర్చీ ఫిల్మ్స్ -గ్రాఫిక్ ఇండియాతో కలిసి జోయా అక్తర్ - రీమా కగ్తీ `టైగర్ బేబీ ఫిల్మ్స్` బ్యానర్ లో నిర్మించారు. ఈ చిత్రం 1960ల నాటి కథాంశంతో రూపొందింది. యువతరం స్నేహం.. తిరుగుబాటు... తొలి ప్రేమలు.. హార్ట్ బ్రేకింగ్ ట్విస్టులు..విద్రోహం వగైరా అంశాల మేళవింపుతో రూపొందింది. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే ఈ సిరీస్ లో సుహానా.. ఖుషీ కపూర్ ఇద్దరిలో ఎవరు ది బెస్ట్ అనిపిస్తారో చూడాలన్న ఉత్సాహం అభిమానులకు ఉంది. అభిమానుల ఉత్కంఠకు తెర దించేందుకు ఇంకెంతో సమయం లేదని కూడా తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.