హాలీవుడ్ లో 'మార్వెల్ కామిక్స్' ఆధారంగా 2008లో మార్వెల్ సినీ ప్రయాణం మొదలైంది. మార్వెల్ మొదటి సినిమా 'ఐరన్ మేన్'. ఆ తర్వాత ఈ కామిక్ బుక్ ఆధారంగా సూపర్ హీరోల సినిమాలు వచ్చాయి. ఈ పదేళ్లలో 21 సూపర్ హీరోల సినిమాలను నిర్మించింది మార్వెల్ స్టూడియోస్. ఈ ప్రాసెస్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమాన సామ్రాజ్యాన్నే నిర్మించిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ పదేళ్లలో సృష్టింపబడ్డ సూపర్ హీరోలందరికీ గుడ్‌బై చెప్పే తరుణం వచ్చింది. 'అవెంజర్స్: ఎండ్ గేమ్' సినిమాతో సూపర్ హీరోలకు టాటా చెప్పేసింది మార్వెల్ సంస్థ.
సినిమాలో ఒక్క సూపర్ హీరో ఉంటేనే వీఎఫ్‌ఎక్స్ విధ్వంసం జరుగుతుంది. అలాంటిది అరడజను మందికి పైగా ఉంటే? అందులోనూ (ఐరన్‌మేన్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో, థార్) సూపర్ హీరో పాత్రలకు ముగింపు పలికే సినిమా అంటే ఎలా ఉండాలి? కేవలం ఒక్క సినిమాగా చూసి సంతృప్తి కలిగించేలా కాదు. పదేళ్లుగా ఏర్పడ్డ అభిమానాన్ని, జ్ఞాపకాల్ని సంతృప్తిపరచాలి. అంచనాలు ఆకాశాన్ని మించిపోయాయి. అద్భుతమైన కథ, కథనం, గ్రాఫిక్స్ సాయంతో రుస్సో బ్రదర్స్ ఆ ఫీట్‌ను ఈజీగా అందుకోగలిగారు అని చెపొచ్చు. మూడు గంటలు ఊపిరి సలపని యాక్షన్, సర్‌ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు, కంట తడి పెట్టించే సన్నివేశాల కలయికే 'ఎండ్ గేమ్'.
అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా పై ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రభావం ఉందటున్నాడు డైరెక్టర్ జో రూసో. ముంబైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 'ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ ఆల్ట్రోన్' లోని క్లైమాక్స్ సీన్లను ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ 'రోబో' మూవీ చాలా ప్రభావితం చేసింది. రోబోలో మీకు తెలుసా.. రోబోలన్నీ కలిసి వచ్చి పెద్దపాము మాదిరిగా మారిపోవడం చూశాం. ఆల్ట్రోన్ లోని అన్ని ఆల్ట్రోన్లు కలిసి ఒక పెద్ద ఆల్ట్రోన్ గా మారిపోతాయి. ఎవెంజర్స్ దానితో పోరాడాల్సి ఉంటుంది. రోబోలోని క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం మొత్తం మా మూవీ క్లైమాక్స్ సీన్‌తో ప్రేరణ పొందేలా చేసింది' అని చెప్పారు. ఒక ఇండియన్ సినిమా హాలీవుడ్ సినిమాకి ప్రేరణ కావడం గర్వకారణం అని సినీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.