కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబర్ 29వ తేదీన తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవిలు ఈరోజు పునీత్ పార్థివ దేహానికి తుది నివాళులు అర్పించారు. పునీత్ మరణం సినీ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఎంతో ఫిట్ గా ఉండే పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా మరణించారు. గుండెపోటుతో ఆయన మరణించారనని కొందరు అంటుండగా.. అతిగా జిమ్ చేయడం వల్లే మరణించారని కొందరు అంటున్నారు.
అయితే మొత్తంగా కార్డియాక్ అరెస్టుతో రాజ్ కుమార్ చనిపోయారని చెబుతున్నారు. అయితే రాజ్ కుమార్ మరణించేందుకు ముందు ఎటు వెళ్లారు..? ఆయన చివరిగా గడిపిన క్షణాలు ఎక్కడా..? అనే విషయాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం రాజ్ కుమార్ మరణించగా.. ఆయనకు గురువారం రాత్రే గుండెపోటు వచ్చిందని అంటున్నారు. అయితే గురువారం రాత్రి రాజ్ కుమార్ ప్రముఖ సంగీత డైరెక్టర్ ఇంట్లో బర్త్ డే పార్టీకీ హాజరయ్యారు. అక్కడ ఏం జరింది..? అనే విషయం ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ఆయన వ్యక్తిగత వైద్యుడు రమణారావు ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
పునీత్ ఆరోగ్యంపై అవగాహన ఉన్న వ్యక్తి ఈ డాక్టర్. అందుకే పునీత్ మరణంపై స్పందించాడు. పునీత్ కు ఎలాంటి కోమోర్బిడిటీలు లేవన్నారు. నిన్న ఆయన అసౌకర్యానికి గురవుతున్నట్టు తెలిపాడన్నారు. పునీత్ ఆరోగ్యం గురించి ఇలాంటివి వినడం ఇదే తొలిసారి. అప్పుడు నేను కొన్ని పరీక్షలు నిర్వహించాను. అతని బీపీ నార్మల్‌గా ఉంది. అతని గుండె చప్పుడు కూడా నార్మల్‌గా ఉంది.
కానీ పునీత్ కు బాగా చెమటలు పట్టాయి. అనంతరం ఈసీజీ పరీక్షను నిర్వహించాను.. కొంచెం ఆరోగ్యం గందరగోళం ఉందని తెలుసుకొని 5-6 నిమిషాలలో అతడిని విక్రమ్ హాస్పిటల్‌కి వెళ్లమని నేను సలహా ఇచ్చాను. కానీ పాపం అతని ప్రాణాలు కాపాడలేకపోయాం'' అని డాక్టర్ రమణారావు వెల్లడించారు. పునీత్ గుండెపోటుతో కానీ, గుండె ఆగిపోవడంతో కానీ మరణించలేదని రమణ తెలిపారు. "పునీత్ ఎందుకు చనిపోయాడో ఖచ్చితమైన కారణాన్ని మేము ఎప్పటికీ గుర్తించలేము" అన్నారు. ఇవి ఖచ్చితంగా పునీత్ వ్యక్తిగత డాక్టర్ నుండి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. గుండెపోటుతో అని అందరూ అంటున్నా కారణం వేరే ఉంటుందని తెలుస్తోంది.