బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'అంధాదున్' ఆధారంగా నితిన్ చేసిన చిత్రం 'మాస్ట్రో'. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ట్రాక్ మార్చిన నితిన్ ప్రస్తుతం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'మాచర్ల నియోజక వర్గం' చిత్రంలో నటిస్తున్నారు. ఎడిటర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఎం.ఎస్. రాజశేఖరరెడ్డి ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ అండ్ ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కేథరిన్, కృతిశెట్టి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇటీవలే హీరో నితిన్ పాల్గొనగా కీలకమైన హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేశారు. ఈ ఫైట్ కి ఫేమస్ ఫైట్ మాస్టర్స్ అనల్ - అరసు కొరియోగ్రఫీ చేశారు. గత కొంత కాలంగా సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటూ పోతున్న ఈ చిత్ర బృందం తాజాగా గురువారం ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ని అభిమానులతో పంచుకున్నారు. మాచర్ల నియోజక వర్గం ఫస్ట్ లుక్ ని ఫస్ట్ చార్జ్ అనే పేరుతో ఈ నెల 26న డిఫరెంట్ గా రిలీజ్ చేస్తున్నారు.
ఇందులో హీరో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్ గా కనిపించబోతున్నారు. ఆయన పాత్ర పేరు ఎన్. సిద్ధార్ధ్ రెడ్డి. ఈ విషయాన్ని వెల్లడిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆబ్స్ట్రాక్ట్ నేరుతో ఓ ఆర్డర్ లెటర్ ని కూడా చిత్ర బృందం విడుదల చేసింది.
సినిమా కాన్సెప్ట్ లో భాగంగా ఫస్ట్ లుక్ ని అదే పద్దతిని ఫాలో అవుతూ మేకర్స్ విడుదల చేసిన ఆర్టర్ చార్జ్ లెటర్ కూడా వినూత్నంగా వుండటమే కాకుండా ప్రాజెక్ట్ పై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది.
గుంటూరు జిల్లా కలెక్టర్ గా హీరో కు బాధ్యతల్ని అప్పగిస్తూ పోస్టింగ్ ఇస్తున్న లెటర్ ఇప్పడు నెట్టింట వైరల్ గా మారింది. సరికొత్త పంథాలో హై వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈమూవీ ఫస్ట్ లుక్ ని ఈ నెల 26న ఉదయం 10:08 నిమిషాలకు విడుదల చేస్తున్నారు.
ఇదే విషయాన్ని గురువారం విడుదల చేసిన పోస్టర్ లో చిత్ర బృందం వినూత్నంగా వెల్లడించింది. కీలక నటీనటులు నటిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మురెళ్ల కెమెరా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, మామిడాల తిరుపతి డైలాగ్స్, సాహి సురేష్ ఆర్ట్.