టాలీవుడ్ లో స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు మురనుపెన్నడూ లేనంతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్..నుంచి కిరణ్ అబ్బవరం వరకు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. మూడు క్రేజీ సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్నాడు. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ కూడా వరుస సినిమాలు సిరీస్ లతో బిజీగా గడిపేస్తున్న విషయం తెలిసిందే.
వీరి తరమాలోనే సీనియర్ హీరనో నందమూరి బాలకృష్ణ కూడా రెండు ప్రాజెక్ట్ లతో బిజీగా వున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేస్తున్న 'వీర సింహారెడ్డి' సంక్రాంతికి రిలీజ్ కావడానికి రెడీ అవుతుండగా ఆ వెంటనే మరో క్రేజీ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని బాలకృష్ణ చేయబోతున్న విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ ప్రకటించి నెలలు కావస్తున్నా దీనికి సంబంధించిన అప్ డేట్ ఇంత వరకు బయటికి రాలేదు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి, హరీష్ పెద్ది అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెరపైకి తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల కీలక పాత్రలో నటించనున్నీ మూవీలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు.
లుక్ పరంగా, స్టోరీ పరంగా చాలా కొత్తగా వుంటుందని తెలుస్తోంది. ఇందులో బాలయ్య వయసుమల్లిన వ్యక్తిగా సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. బాలయ్య 'వీర సింహారెడ్డి' షూటింగ్ లో బిజీగా వుండటం, ఈ మూవీ సంక్రాంతికి రిలీ కానున్న నేపసథ్యంలో అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది. అంతే కాకుండా సెకండ్ హాఫ్ లో బాలయ్య మార్పులు చేర్పులు చెప్పారట. దాని వర్క్ ఇంకా పెడింగ్ లో వుండటంతో ఈ మూవీ షూటింగ్ పెండింగ్ పడుతూ వస్తోంది.
ఎట్టకేలకు ఫైనల్ వెర్షన్ ని అనిల్ రావిపూడి పూర్తి చేయడంతో డిసెంబర్ 9న ఈ మూవీని ప్రారంభించడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ ని కూడా మొదలు పెట్టబోతున్నారట. 'రామారావు గారు' అనే టైటిల్ ని కూడా ఈ మూవీ కోపం పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ నే ఫైనల్ చేస్తారా? లేక మరో టైటిల్ కి వెళతారా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.