ఇంతకుముందు ప్రేమవివాహం చేసుకునేందుకు సిద్ధమై.. నిశ్చితార్థం అయ్యాక క్యాన్సిల్ చేసుకుంది రష్మక మందన. తనను పరిశ్రమకు పరిచయం చేసిన కన్నడ హీరో రక్షిత్ ని ప్రేమించిన రష్మిక కిరిక్ పార్టీ మూవీ తర్వాత తెలుగులో పెద్ద ఆఫర్లు అందుకుంది. ఆ క్రమంలోనే కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవడం రక్షిత్ తో విడిపోవడం అనంతరం అభిమానుల ట్రోల్స్ కి గురి కావడం వగైరా వగైరా ఎపిసోడ్స్ తెలిసినదే
ఇప్పుడు మెహ్రీన్ కూడా నిశ్చితార్థం అనంతరం బిష్ణోయ్ నుంచి విడిపోవడానికి కారణం సినిమా కెరీర్ పై దృష్టి సారించడమేనని తెలిసింది. పెళ్లి తర్వాతా నటించేందుకు మెహ్రీన్ ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ అత్తమామల తరపున ఎవరూ దీనికి అంగీకరించలేదని తెలిసింది. బిష్ణోయ్ కుటుంబం రాజకీయంగా పలుకుబడి ఉన్న పెద్ద ఫ్యామిలీ. అందువల్ల మెహ్రీన్ స్వచ్ఛకు ఆటంకం కలిగించారని దీంతో మెహ్రీన్ తప్పని పరిస్థితుల్లో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని ప్రచారమవుతోంది.
నిజానికి నిశ్చితార్థం సందర్భంగా వధూవరుల ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ అయిపోయాయి. ఆ ఇద్దరూ కలిసి షికార్లు చేయడం ప్రేమను పంచుకోవడం వగైరా ఎపిసోడ్స్ అందరికీ తెలిసినదే. కానీ ఇంతలోనే మెహ్రీన్ ఆ వివాహాన్ని రద్దు చేసుకోవడం సంచలనమైంది.
ఓవైపు అమీర్ ఖాన్ - కిరణ్ రావు 15 ఏళ్ల సంసార జీవనానికి ముగింపు పలికి విడాకులు తీసుకుంటుంటే మరోవైపు మెహ్రీన్ నిశ్చితార్థం రద్దు నిర్ణయం కూడా అంతకుమించి సంచలనమైంది. రష్మిక మందన తరహాలోనే కెరీర్ గురించి ఆలోచించి మెహ్రీన్ పెళ్లిని రద్దు చేసుకుంది. ఇకపోతే రష్మిక మందన కు మెహ్రీన్ కి చిన్న డిఫరెన్స్ ఏమంటే.. ఒకటి ప్రేమ వివాహం అయితే ఇంకోటి పెద్దలు కుదిర్చినది. ఈ ఇద్దరిదీ ఒక దారి అనుకుంటే.. అమలాపాల్ వీళ్లకంటే గట్సీగా నిర్ణయం తీసుకున్నారు. తాను కూడా పెళ్లి తర్వాత నటిస్తానని అంటే విజయ్ తల్లిదండ్రులు అంగీకరించలేదని అప్పట్లో కథనాలొచ్చాయి. అందుకే విభేధాలతో అమలాపాల్ విడిపోయారు.