సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' నిన్న గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు కెరీర్లో 25 వ చిత్రం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అయింది. సాధారణ ప్రేక్షకులే కాకుండా ఈ సినిమాపై సెలబ్రిటీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమా చూసిన తర్వాత ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశాడు.
"మహర్షి ని చూశాను. మూడు షేడ్స్ ఉన్న పాత్రలో మహేష్ ఎంతో గొప్పగా ఒదిగిపోయాడు. స్టూడెంట్ గా మహేష్ లుక్.. ఎనర్జీ & యాటిట్యూడ్ చూసి థ్రిల్ అయ్యాను. అల్లరి నరేష్ హృదయాన్ని కదిలించేలా నటించాడు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఆయన టీమ్ నిజాయితీతో కూడిన ఒక మంచి ప్రయత్నం చేశారు." అంటూ మహర్షి పై ప్రశంసల వర్షం కురిపించాడు. మరో ట్వీట్ లో ఈ సినిమా థీమ్ ను ప్రస్తావిస్తూ "రైతులకు మన సానుభూతి అవసరం లేదు. మన గౌరవానికి రైతులు అర్హులు.. వారిని గౌరవించే బాధ్యత మనది" అన్నారు.
ఈ ట్వీట్లకు స్పందనగా మహేష్ ఫ్యాన్స్ చాలామంది శ్రీను వైట్లకు కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బాబుతో గతంలో శ్రీను వైట్ల 'దూకుడు'.. 'ఆగడు' చిత్రాలను తెరకెక్కించాడు. 'దూకుడు' మహేష్ కెరీర్ర్లో ఒక మెమొరబుల్ ఎంటర్టైనర్ గా నిలవగా 'ఆగడు' మాత్రం పూర్తిగా నిరాశపరిచింది.