ఫకీర్ కోసం గట్టిగానే కష్టపడ్డాడే

Update: 2018-02-10 10:14 GMT
ఏదేమైనా కోలీవుడ్ గురించి ఒక మాట చెప్పాలంటే అక్కడ హీరోలు ఉన్నారు అనడం కన్నా సంపూర్ణ నటి నటులు కొంచెం ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు. ఎంతలా అంటే లోకల్ సినిమా నుంచి హాలీవుడ్ స్థాయి సినిమాలో నటించి ఆకట్టుకుంటారు. ఇంకా ప్రయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రాణాలనను మానాన్నీ అస్సలు లెక్క చేయరు. అవసరం అయితే వంటిపై నూలు పోగు లేకుండా నటించేస్తారు.

ఇక అసలు విషయానికి వస్తే కోలీవుడ్ లో సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ ఏ స్థాయిలో సినిమాలను చేస్తాడో అందరికి తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకొని అన్ని ఇండస్ట్రీలలో తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇక హాలీవుడ్ లో ది ఎక్స్‌ ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఫకీర్‌ అనే సినిమాను చేసేశాడు. ఆ సినిమాకు సంబందించి ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. అయితే అందులో కొన్ని సన్నివేశాలలో ధనుష్ చాలా కష్టపడి చేశాడట.

అంతే కాకుండా షర్టు లేకుండా కొన్ని సీన్లను బాగానే చేశాడట. ఇక రొమాన్స్ సన్నివేశాలను కూడా టచ్ చేశాడని తెలుస్తోంది. తెల్ల తోలు పిల్లకు లిప్ లాక్ కూడా పెట్టేశాడు. ఆ సిన్ చాలా క్లిక్ అవుతుందట. ఇక సినిమాపై ప్రస్తుతం బాలీవుడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ కోలీవుడ్ హీరో నటనకు అక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి సమ్మర్ లో రాబోయే ఆ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.    
Full View

Tags:    

Similar News