ఇండస్ట్రీ ఏదైనా సరే.. సీనియర్లకు హీరోయిన్ ను వెతకడం అంటే.. ఏజ్ దాటిపోయిన అబ్బాయికి పెళ్లికూతురిని సెట్ చేయడమంత కష్టంగా ఉంటోంది! కుర్ర హీరోయిన్లతో ఆడిపాడటానికి వాళ్లు సిద్ధంగా ఉన్నా.. 'పెద్ద'ల సరసన చేయడానికి వీళ్లు రెడీ అవుతున్నా.. ఆడియన్స్ మాత్రం 'మేం ఒప్పుకోం' అంటున్నారు. దీంతో.. ఈ యవ్వారం మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. చివరకు కాస్త అటూ ఇటుగా ఎవరో ఒకర్ని సెట్ చేసి, ఆ ప్రాజెక్టును గట్టెక్కిస్తున్నారు.
కానీ.. ప్రతీసారి ఎలా సాధ్యమవుతుంది? కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో సీనియర్లు.. ఈతరం పిల్లలతో రొమాన్స్ చేయక తప్పట్లేదు. ఇప్పుడు మాస్ రాజా రవితేజ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. తన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'క్రాక్' సినిమాలో సీనియర్ హీరోయిన్ శ్రుతిహాసన్‌తో ఆడి పాడాడు రవితేజ. అక్కడ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కానీ.. రాబోయే సినిమాల్లో కుర్ర హీరోయిన్లతో జతకట్టబోతున్నాడు.
ప్రస్తుతం 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో మాస్‌రాజాకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. వీళ్లిద్దరూ రవిజేత కంటే చాలా చిన్నవాళ్లు. అయితే.. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇందులోనూ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. వీరిద్దరూ మీనాక్షి, డింపుల్ కన్నా చిన్నవాళ్లు. వీళ్లిద్దరూ రవితేజ వయసులో సగం కంటే తక్కువగా ఉండడం గమనార్హం.
వీరిలో ఒకరు తమిళ కథానాయిక ఐశ్వర్యా మీనన్ కాగా.. మరొకరు కన్నడ చిన్నది శ్రీలీల. వీరిలో ఐశ్వర్య వయసు 25 ఏళ్లు. కానీ.. చూడ్డానికి అంత వయసున్నట్టు కనిపించదు. రవితేజ పక్కన ఈమె చాలా చిన్న పిల్లగా కనిపిస్తుంది. ఆమెనే చిన్నగా ఉంటుందంటే.. ఇక, శ్రీలీల వయసు మరీదారుణంగా 19 సంవత్సరాలే కావడం గమనార్హం. అంటే.. ఈ పిల్ల ఏజ్ రవితేజతో కంపేర్ చేస్తే.. మూడో వంతుకన్నా తక్కువ అన్నమాట. మరి, ఇంత కుర్రహీరోయిన్ తో రవితేజ రొమాన్స్ చేస్తే.. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.