దేశంలోనే అత్యధిక బడ్జెట్‌ చిత్రం

Update: 2020-11-30 02:30 GMT
రణ్‌ బీర్‌ కపూర్‌.. ఆలియా భట్‌ జంటగా అమితాబచ్చన్‌.. నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మస్త్ర. ఈ సినిమా గురించి గత రెండేళ్లుగా బాలీవుడ్‌ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా బడ్జెట్‌ విషయంలో మరోసారి ఆసక్తికర చర్చ జాతీయ మీడియాలో జరుగుతోంది. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమాకు ఖర్చుచేయనంత బడ్జెట్‌ ను ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నట్లుగా హిందుస్తాన్‌ టైమ్స్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌ లో ప్రకటించారు.

ఖచ్చితంగా ఎంత బడ్జెట్‌ అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. కాని 2.ఓ... సాహో మరియు బాహుబలిని మించిన బడ్జెట్‌ తో బ్రహ్మస్త్ర రూపొందుతున్నట్లుగా జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన భారీ బడ్జెట్‌ చిత్రాల బడ్జెట్‌ కంటే ఈ సినిమా బడ్జెట్‌ ఎక్కువ అంటూ వారు చెబుతున్నారు. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. డిస్నీ సంస్థ మరియు కరణ్‌ జోహార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ మరి కొన్నాళ్లకు పూర్తి అవ్వబోతుంది. వచ్చే ఏడాది ద్వితీయార్థంకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Tags:    

Similar News