తెలుగు ప్ర‌జ‌లు నాకు బ‌హుమ‌తిగా ఇచ్చిన ఇల్లు

Update: 2021-07-04 05:36 GMT
2020-21 సీజ‌న్ చాలా మందికి క‌లిసి రాలేదు. మ‌హ‌మ్మారీ రంగ ప్ర‌వేశంతో ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ అత‌లాకుత‌లం అయ్యాయి. తెలుగు-త‌మిళ‌-హిందీ ప‌రిశ్ర‌మ‌లు తీవ్ర సందిగ్ధంలో ప‌డిపోయాయి. దాంతో పాటే క‌ళాకారుల ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. అయితే ఎవ‌రికి ఏం జ‌రిగినా కానీ శ్రుతిహాస‌న్ కి మాత్రం ఈ సీజ‌న్ బాగా క‌లిసొచ్చింది.

వ్య‌క్తిగ‌త జీవితంలో ఒడిదుడుకుల అనంత‌రం కొంత గ్యాప్ త‌ర్వాత ఈ అమ్మ‌డు తిరిగి టాలీవుడ్ లో అదిరిపోయే కంబ్యాక్ ని చాటుకుంది. ర‌వితేజ‌ క్రాక్ చిత్రంతో బంప‌ర్ హిట్ కొట్టి ఆ వెంట‌నే వ‌కీల్ సాబ్ లాంటి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఇంత‌కుముందే వేరొక క‌థానాయిక‌కు ఇలా కంబ్యాక్ లో బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలు ద‌క్కింది చాలా అరుదు. పైగా ఈ ఏడాది `హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్` టైటిల్ ని శ్రుతి ద‌క్కించుకుంది. నంబ‌ర్ వ‌న్ డిజైర‌బుల్ హోదాతో త‌న కీర్తి కిరీటంలో మ‌రో మైలు రాయి చేరింది. ప‌నిలో ప‌నిగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ లాంటి క్రేజీ మూవీలో శ్రుతి ఆఫ‌ర్ ద‌క్కించుకుని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇక తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న కంబ్యాక్ విష‌యంలో చాలామంది సందేహాలు వ్య‌క్తం చేసినా కానీ తాను ఎప్పుడూ న‌మ్మ‌కాన్ని కోల్పోలేద‌ని హైద‌రాబాద్ త‌న ఇల్లు అని శ్రుతి వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తిక‌రం. ``నేను నా సంగీతంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి సమయం తీసుకున్నాను. ఎక్కువ రాయడం ప్రదర్శించడంపై దృష్టి పెట్టాను. ఇది నేను తీసుకున్న చిన్న పాటి విరామం. కానీ నేను తెలుగు సినిమాకి తిరిగి వస్తాననే సందేహం ఎప్పుడూ లేదు. కొంతమందికి సందేహాలు ఉన్నాయి. కానీ నేను ఎప్పుడూ అలా అనుకోలేదు. ఇది ఎల్లప్పుడూ నాకు చెందిన పరిశ్రమ అని తెలుసు`` అని శ్రుతి వ్యాఖ్యానించింది. తెలుగు ప్ర‌జ‌లు నాకు బ‌హుమ‌తిగా ఇచ్చిన ఇల్లు ఇది.. అని శ్రుతి ఎమోష‌న్ అవ్వ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

శ్రుతిహాస‌న్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారు. ఇక్క‌డ వ‌రుస‌గా సినిమాల‌కు క‌మిట‌య్యేందుకు క‌థ‌లు వింటున్నారు. అటు చెన్నై ముంబైలోనూ అడ‌పాద‌డ‌పా షికార్లు చేస్తూ పెద్ద అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నారు. మునుముందు ప‌వ‌న్ స‌హా ప‌లువురు అగ్ర హీరోల స‌ర‌స‌న శ్రుతి న‌టించ‌నుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News