కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రముఖ స్టంట్స్ మాస్టర్స్ సారధ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లుగా పేర్కొన్న విషయం తెల్సిందే. ఈ షెడ్యూల్ లో యష్ మరియు సంజయ్ దత్ లు పాల్గొంటున్నారు. వీరిద్దరి మద్య జరిగే ఫైటింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్ అన్నట్లుగా ఉంటుందని.. విజువల్ వండర్ గా ఉండటంతో పాటు చాలా రియాల్టీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ ఫైట్ సన్నివేశంపై దర్శకుడు అంచనాలు భారీగా పెంచాడు.
ఈ ఫైట్ సన్నివేశం గురించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నేటి వరకు సంజయ్ దత్ పై కీలక షాట్స్ చిత్రీకరించారు. రేపటి నుండి అసలు పోరాటం మొదలు అవుతుందని అంటున్నారు. కేజీఎఫ్ స్టార్ యశ్ మరియు సంజయ్ దత్ లు పోరాటం రేపటి నుండి అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. రెండు వారాల పాటు ఈ యాక్షన్ సన్నివేశంను చిత్రీకరించబోతున్నట్లుగా చెబుతున్నారు. డిసెంబర్ మూడవ వారం వరకు సినిమా షూటింగ్ ముగియబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడే సినిమాకు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలున్నాయట.