'మా' ప్రారంభించిన ఇన్నేళ్లలో పలు సార్లు ఎన్నికలు జరిగాయి. దాదాపుగా 900 మంది సభ్యుల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా 50 శాతం ఆపై ఓటింగ్ నమోదు కాలేదు. కాని మొదటి సారి మా ఎన్నికల చరిత్రలో భారీ ఎత్తున పోలింగ్ జరిగింది. ప్రముఖుల నుండి మొదలుకుని ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు కూడా ఎన్నికల్లో హాజరు అయ్యారు. జెనీలియా ముంబయి నుండి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక కొందరు చాలా ఇబ్బంది పడుతూ కూడా వచ్చారు. కాని కొందరు స్టార్స్ మాత్రం ఈసారి కూడా ఓటింగ్ పై ఆసక్తి చూపించలేదు. అందరి దృష్టి అక్కినేని మాజీ జంట నాగచైతన్య మరియు సమంతలపై ఉంది. వీరిద్దరు ఓటింగ్ లో పాల్గొంటారా లేదా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగార్జున మరియు అఖిల్ లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిద్దరు ఓటు వేయడంతో చైతూ కూడా వస్తున్నాడు అంటూ పోలింగ్ కేంద్రం వద్ద హడావుడి కనిపించింది. కాని కొద్ది సమయం తర్వాత నాగచైతన్య వస్తున్నట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని.. ఆయన షూటింగ్ తో బిజీగా ఉన్నట్లుగా మరో ప్రచారం జరిగింది. అలా చైతూ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాలేదు. ఇక సమంత కూడా విడాకులు మరియు ఇతరత్ర కారణాల వల్ల ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. సమంత మరియు నాగచైతన్యలు ఇద్దరు కూడా ఓటింగ్ లో పాల్గొనక పోవడంకు కారణం మీడియా ముందుకు వారు వచ్చేందుకు ఇప్పుడు ఆసక్తిగా లేరు.
ఎన్నికల కోసం వచ్చినా కూడా మీడియా మరియు జనాలు రచ్చ రచ్చ చేస్తారు. ఇక సమంత ను జనాలు మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె అబార్షన్స్ చేయించుకుంది అంటూ ప్రచారం చేయడం మొదలుకుని ఇష్టానుసారంగా సామ్ గురించి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు ఆమెకు వచ్చేందుకు ఆసక్తి లేదని వెళ్లడి అయ్యింది. ఇక నాగచైతన్య మరియు సమంతలు పూర్తి ఇష్ట ప్రకారం విడిపోయారు. ఇద్దరు కూడా చాలా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారు. దీంట్లో ఎవరిని తప్పుబట్టడానికి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగ చైతన్య మరియు సమంత ల విషయమై ఫ్యామిలీ మీడియా ముందు ఇప్పటి వరకు మాట్లాడింది ఏమీ లేదు. ఇక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన నాగార్జున మీడియాతో మాట్లాడకుండానే అక్కడ నుండి వెళ్లి పోయారు.