తాజా గుస‌గుస‌.. న‌య‌న‌తార ఫ్రెగ్నెంట్?

Update: 2022-08-11 03:48 GMT
ద‌క్షిణాదిన నంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా స‌త్తా చాటుతోంది న‌య‌న‌తార‌.  ఇటీవ‌లే త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ని న‌య‌న్ పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. వివాహానంతరం కూడా న‌య‌న్ బ్రాండ్ వ్యాల్యూ కించిత్ కూడా త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ న‌య‌న‌తార‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. న‌య‌న్ ప్ర‌స్తుతం కింగ్ ఖాన్ షారూక్ స‌ర‌స‌న అట్లీ తెర‌కెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే.

ఇంత‌లోనే న‌య‌న్ పై ఓ ఆస‌క్తిక‌ర రూమ‌ర్ పుట్టుకొచ్చింది. దాని సారాంశం ప్ర‌కారం.. న‌య‌న‌తార ప్ర‌స్తుతం గ‌ర్భ‌వ‌తి. వాంతులు చేసుకుంటోంది!! ఇంత‌కీ ఈ గాసిప్ ని పుట్టించింది ఎవ‌రు? అంటే చెన్నై కి చెందిన త‌మిళ‌ మీడియాలో ఇలాంటి క‌థ‌నాలు సంచ‌ల‌నంగా మారాయి.

న‌య‌న్ తొలి బిడ్డ‌కు స్వాగ‌తం చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ని ..వాంతులకు కార‌ణ‌మిదేన‌ని ఊహాగానాలు మీడియాలో ప్ర‌చురిత‌మ‌య్యాయి. అయితే ఆ వాంతుల వెనుక ఓ ఫన్నీ స్టోరీని కూడా చెన్నై మీడియా రివీల్ చేయ‌డంతో అస‌లు సంగ‌తి తెలిసింది.

నిజానికి ఈ వాంతుల‌కు కార‌ణం న‌య‌న్ గ‌ర్భం కాదు.. త‌న భ‌ర్త వండి పెట్టిన వంటకం అని తెలిసింది. ఆయ‌న ప్రేమ‌గా వండి వ‌డ్డించిన తిండి తిన్న త‌ర్వాత న‌య‌న‌తార ప‌రిస్థితి అలా అయ్యింది. ఆ త‌ర్వాత డాక్ట‌ర్లు చెక్ చేసి కొంత‌సేపు ప‌రిశీల‌న‌లో ఉంచి తర్వాత ఆస్ప‌త్రి నుంచి ఇంటికి పంపార‌ట‌. అయితే ఇంత‌లోనే చెన్నై మీడియాలో న‌య‌న్ గ‌ర్భిణి అంటూ ప్రచారం సాగిపోయింది.  మొత్తానికి అదేదీ నిజం కాద‌ని తేలిపోయింది.

న‌య‌న‌తార విష‌యంలో మీడియా ఎప్పుడూ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుంది. త‌న ప్రేమాయ‌ణాలు స‌హా సినిమాల లీకుల నుంచి ప్ర‌తిదీ సెన్సేష‌నే. ఇటీవ‌ల విఘ్నేష్ ని పెళ్లాడక ముందు ఈ జంట ఇప్ప‌టికే సీక్రెట్ గా పెళ్లాడేసింద‌ని కూడా క‌థ‌నాలు అల్లాయి మీడియాలు. కానీ అవేవీ నిజాలు కాలేదు. అందువ‌ల్ల న‌య‌న్ పై వ‌చ్చే ఏ రూమ‌ర్ ని అయినా చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి నిజ‌మో కాదో తెలుసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది.

పారితోషికంలో నంబ‌ర్ వ‌న్ స్టార్ న‌య‌న‌తార ఒక్కో సినిమాకి 8 కోట్ల పారితోషికం అందుకుంటూ ద‌క్షిణాదిన నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. క‌త్రిన‌- క‌రీనా- అనుష్క శ‌ర్మ‌ రేంజులో న‌య‌న్ పారితోషికం అందుకుంటోంద‌న్న టాక్ వినిపిస్తోంది. చాలా మంది అగ్ర తార‌ల హోదాలో ఉన్న బాలీవుడ్ నాయిక‌ల‌తో పోలిస్తే న‌య‌న‌తార పారితోషికం చాలా ఎక్కువ‌. అయితే ఆ రేంజులో క్రౌడ్ ని పుల్ చేయ‌గ‌ల ద‌క్షిణాది క‌థానాయిక‌గా త‌న రేంజు వేరే లెవ‌ల్ లో ఉంది. సౌత్ లో అంద‌రు అగ్ర హీరోల స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించింది. ప్ర‌స్తుతం కింగ్ ఖాన్ షారూక్ స‌ర‌స‌న అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఖాన్ కి కూడా న‌య‌న్ ల‌క్కీ ఛామ్ గా మార‌నుంది.
Tags:    

Similar News