తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త లెజెండ్ శరవణన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. శరవణ స్టోర్స్ ప్రకటనలలో స్టార్ హీరోయిన్లతో నటించి ట్రోలింగ్ ఎదుర్కొన్న ఆ స్టోర్స్ అధినేత ఆయన. ఇప్పుడు ''ది లెజెండ్'' అనే చిత్రంతో హీరో అవతారమెత్తి సినీరంగ ప్రవేశం చేస్తున్నాడు.
ఇందులో కథానాయకుడిగా నటించడమే కాదు.. న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ - అగ్రశ్రేణి టెక్నిషియన్స్ తో స్టార్ హీరోల చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాని తెరకెక్కించారు.
'ది లెజెండ్' చిత్రాన్ని జూలై 28న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తాజాగా 'ది లెజెండ్' తెలుగు ట్రైలర్ ను ఆవిష్కరించారు. తమిళ ట్రైలర్ లాంచ్ కోసం పది మంది హీరోయిన్లను గెస్టులుగా తీసుకొచ్చిన శరవణన్.. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.
'ప్రపంచమే ఆశ్చర్యపోయే పెద్ద సైంటిస్ట్ మీరు.. ఇంత చిన్న ఊరికి వచ్చి ఏం చేస్తారు' అంటూ శరవణన్ ను మైక్రో బయాలజీ శాస్త్రవేత్తగా పరిచయం చేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. 'నా చదువు తెలివి తేటలు ఈ దేశ ప్రజలకు ఉపయోగపడాలి.. అదే నా కోరిక' అని హీరో చెబుతున్నాడు.
ట్రైలర్ చూస్తుంటే యాక్షన్, ఎమోషన్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు సోషల్ మెసేజ్ కూడా ఇస్తున్నట్లు అర్థం అవుతోంది. లెజెండ్ శరవణన్ ఫస్ట్ సినిమాకే మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ప్రపంచాన్ని కాపాడే కథాంశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
భారీ సెటప్పులు - అద్భుతమైన గ్రాఫిక్స్ - రిచ్ విజువల్స్ మరియు కలర్ ఫుల్ స్టార్ క్యాస్టింగ్ తో లెజెండ్ శరవణన్ సినిమాని గ్రాండియర్ గా రూపొందించారు. సాధారణంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్డమ్ ఉన్న అగ్ర హీరోలు నటించే కమర్షియల్ సినిమాల్లో ఇలాంటివన్నీ చూస్తుంటాం.
ఇక రజనీకాంత్ తన రోల్ మోడల్ అని చెప్పే మన లెజెండ్.. వాకింగ్ మరియు స్టైలింగ్ లో సూపర్ స్టార్ ను అనుకరించడానికి ప్రయత్నించాడు. డూప్ తో మేనేజ్ చేసారేమో తెలియదు కానీ.. భారీ యాక్షన్ సీన్స్ కూడా చేయించారు. అంతేకాదు హీరోయిన్లతో రొమాన్స్ - డ్యాన్స్ లు చేయడానికి ట్రై చేశాడు.
ఇందులో గ్లామర్ కోసం ఊర్వశీ రౌతెలా - గీతిక వంటి హీరోయిన్లను తీసుకొచ్చారు. సీనియర్ నటుడు సుమన్ ఇందులో విలన్ గా కనిపించాడు. ప్రభు - నాజర్ - విజయ్ కుమార్ - వివేక్ - లత - కోవైసరళ - యోగిబాబు వంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు.
'ది లెజెండ్' చిత్రానికి జేడి-జెయర్ ద్యయం దర్శకత్వం వహించారు. హారిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. రాజు సుందరం - బృంద - దినేష్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయగా.. అనిల్ అరసు యాక్షన్ డిజైన్ చేశారు.
శరవణన్ స్వీయ నిర్మాణం కావడంతో బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా భారీగా ఖర్చు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రజినీకాంత్ 'శివాజీ' రేంజ్ లో తీసిన 'ది లెజెండ్' మూవీ.. పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుందా లేదా సోషల్ మీడియాలో నెటిజన్లకు ట్రోలింగ్ స్టఫ్ గా మిగులుతుందా అనేది వేచి చూడాలి.
Full View