2021 మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఆర్.ఆర్.ఆర్ పేరు మార్మోగుతోంది. ఇంతలోనే రామ్ చరణ్ - శంకర్ ప్రాజెక్ట్ ని ప్రకటించి మరో సంచలనానికి తెర తీసారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు లావిష్ బడ్జెట్ ని సమకూర్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ వేసవి ప్రారంభంలోనే రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లోని పాన్-ఇండియా చిత్రాన్ని ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులే లేవు. అయితే ఇంతలోనే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ లైకా ప్రొడక్షన్స్ తో చట్టపరమైన వివాదంలో చిక్కుకోవడం తీవ్రంగా నిరాశపరిచింది. ఇది మరో మోస్ట్ అవైటెడ్ `ఇండియన్ 2` (భారతీయుడు 2) వివాదానికి సంబంధించిన వ్యవహారం కావడంతో చెర్రీతో శంకర్ సినిమా సెట్స్ కెళుతుందా లేదా? అన్న డైలమా నెలకొంది.
భారతీయుడు 2 కోసం సుమారు 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఖర్చు చేసినప్పటికీ ఈ చిత్రాన్ని పూర్తి చేయనందుకు శంకర్ పై లైకా నిషేధం దాఖలు చేసింది. ఇండియన్2 పూర్తి అయ్యే వరకు శంకర్ వేరొక చిత్రానికి దర్శకత్వం వహించకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తూ లైకా కోర్టును ఆశ్రయించింది. ఇది రామ్ చరణ్ చిత్రంపై సరికొత్త సందేహానికి కారణమైంది. శంకర్ ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు పుకార్లు వచ్చాయి. మొదట తన తదుపరి చిత్రం సెట్స్ కి వెళ్ళే ముందు ఇండియన్ 2 ని పూర్తి చేయాలని శంకర్ నిర్ణయించుకున్నారని కూడా గుసగుసల వినిపించాయి.
కానీ చివరకు శంకర్ మద్రాస్ హైకోర్టు నుండి భారీ ఉపశమనం పొందారు. శంకర్ పై లైకా ఇచ్చిన నిషేధాన్ని హైకోర్టు నిన్న కొట్టివేసింది. ఏప్రిల్ 22 న జరిగిన విచారణలో కోర్టు న్యాయమూర్తులు శంకర్ -లైకాను ఈ సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. అయితే చర్చలు ఎంతమాత్రం ఫలించలేదు. నిన్న లైకా ప్రొడక్షన్స్ భద్రతను సమకూర్చడానికి దాఖలు చేసిన దరఖాస్తు సహా అన్ని దరఖాస్తులను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇప్పుడు శంకర్ తన పని తాను చేసుకుని పోవచ్చు. అంటే చరణ్ తో మూవీ చేసేందుకు అతడు రెడీ అవుతున్నాడనే భావించాల్సి ఉంటుంది. ఇక చరణ్ - శంకర్ సినిమా కథాంశంపైనా ఇప్పటికే పలు లీకులు అందిన సంగతి తెలిసిందే. ఒక ఐఏఎస్ సీఎం అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథాంశం అని గుసగుసలు వినిపించాయి.