'క్రాక్' రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది కానీ..!

Update: 2021-01-09 14:10 GMT
సంక్రాంతి బరిలో తొలి చిత్రంగా నేడు విడుదల అవ్వాల్సిన మాస్‌ మహారాజా రవితేజ 'క్రాక్‌' సినిమా ప్రీమియర్స్, మార్నింగ్‌, మ్యాట్నీ షోస్‌ క్యాన్సిల్‌ అయిన సంగతి తెలిసిందే. తమిళ నిర్మాతలతో 'క్రాక్‌' చిత్ర నిర్మాత ఠాగూర్‌ మధుకు ఉన్న ఆర్ధికపరమైన లావాదేవీల కారణంగా కోర్టు స్టే విధించింది. దీంతో 'క్రాక్' రిలీజ్ పై స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఠాగూర్‌ మధు ఆ సమస్యను పరిష్కరించడంతో సదరు తమిళ నిర్మాణ సంస్థ విడుదలకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యి 'క్రాక్' సినిమా ఈరోజు ఫస్ట్ షో నుంచి ప్రదర్శించబడుతుందని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

దర్శకుడు గోపీచంద్‌ మలినేని ట్వీట్ చేస్తూ.. ''అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. నేడు ఫస్ట్‌ షో లతో సినిమా విడుదల అవుతుంది. మీ దగ్గర్లో ఉన్న థియేటర్లకు 'క్రాక్‌: ను చూసేందుకు వెళ్లండి'' అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు, మాస్ మహారాజా అభిమానులు, మూవీ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రం నుండి అన్ని ఏరియాల్లో ఫస్ట్ షోలు పడుతున్నాయని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ తాజాగా మనకందిన సమాచారం ప్రకారం 'క్రాక్' సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలోని చాలాచోట్ల ఫస్ట్ షో పడటం లేదని తెలుస్తోంది. కాకపోతే సెకండ్ షో కోసం బుకింగ్స్ స్టార్ట్ చేసారని అంటున్నారు. ఏదేమైనా 'క్రాక్' సినిమా రిలీజ్ లేట్ అయినా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
Tags:    

Similar News