అనుపమ పై అభిమానం ను అలా చూపించబోతున్న మెగా నిర్మాత

Update: 2022-12-31 13:49 GMT
ప్రేమమ్‌ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ ఈ ఏడాది కార్తికేయ 2 మరియు 18 పేజెస్‌ సినిమాలతో పాటు పలు డీసెంట్‌ సక్సెస్ లను దక్కించుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడు టైర్ 2 మరియు టైర్ 3 హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తూ వచ్చింది. స్టార్‌ హీరోలకు జోడీగా ఈ అమ్మడు నటించేందుకు ఒక్క అవకాశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

ఈ ఏడాది దక్కిన సక్సెస్ లతో ఈ అమ్మడు స్టార్‌ హీరోలకు జోడీ గా నటించే అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆ అవకాశంను అల్లు అరవింద్‌ అందిస్తాడని కూడా ఆమె అభిమానులు ఆశ పడుతున్నారు. తనకు కూతురు ఉంటే ఇలా ఉండాలి అనుకుంటున్నాను అంటూ అనుపమ పరమేశ్వరన్ పై ఆసక్తికర వ్యాఖ్యలను ఇటీవల అల్లు అరవింద్‌ చేసిన విషయం తెల్సిందే.

అనుపమ పరమేశ్వరన్ పై తన అభిమానంను సమయం వచ్చినప్పుడల్లా సాధ్యం అయినంత ఎక్కువగా చూపిస్తూ ఉన్న అల్లు అరవింద్‌ వచ్చే ఏడాది ఒక స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చి తన అభిమానంను చూపించాలని అనుపమ అభిమానులు కోరుకుంటున్నారు.

తన కూతురు అన్నట్లుగా అనుపమను పేర్కొన్నాడు కనుక అల్లు అరవింద్ ఆమెకు స్టార్‌ హీరోలకు జోడీగా హీరోయిన్‌ గా నటించే అవకాశంను కల్పిస్తాడా అంటే డౌటే అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఈ మెగా నిర్మాత తల్చుకుంటే మాత్రం ఆమె స్టార్‌ హీరోలకు జోడీగా నటించడం పెద్ద కష్టం ఏమీ కాదు.

ఇప్పటి వరకు స్కిన్‌ షో కు దూరంగా ఉంటూ సాధ్యం అయినంత ఎక్కువగా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను చేయడం కారణంగానే స్టార్‌ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు రావడం లేదు. స్కిన్‌ షో చేస్తే ఈమె క్రేజ్ పడిపోతుంది.. చేయకపోతే స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ వచ్చే అవకాశం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమె ఫేట్‌ ను అల్లు అరవింద్‌ మార్చుతాడేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News