మిల్కీ అవంతికను రేప్‌ చేసినట్లేనా??

Update: 2015-07-21 08:40 GMT
బాహుబలి 300కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ రికార్డుల్ని వేటాడుతూనే ఉంది. అయితే ఇంత ఆదరణ దక్కాక కూడా ఈ సినిమా పై ఇంకా ఏదో ఒకచోట విమర్శ ఎదురవుతూనే ఉంది. ఓ జాతీయ పత్రిక లో పనిచేసే ఓ ప్రముఖ పాత్రకేయురాలు బాహుబలిని ఓ రేంజులో విమర్శించారు. ఇందులో శివుడు పాత్రధారి అవంతిక (మిల్కీ) పై మృగవాంఛ తీర్చుకున్నాడు. ఎవరైనా ఓ అపరిచితుడు మీ ఇంట్లోకి జొరబడి మీ ఆడాళ్ల (అక్క, చెల్లి) విషయంలో ఇలా ఒంటి మీద టాటూలు వేసేస్తే మీరు ఊరుకుంటారా? అంటూ సూటిగా ప్రశ్నించారు సదరు జర్నలిస్టు. ఇంకాస్త డీటెయిల్స్‌ లోకి వెళితే..

శివుడు అవంతికను ప్రేమించి ఎత్తయిన కొండల్ని, జలపాతాల్ని దాటుకుని కొత్త లోకంలోకి అడుగుపెడతాడు. అక్కడికి రాగానే ఓ ఝలక్‌. అవంతిక ఖడ్గం చేపట్టి శత్రువుల్ని చీల్చి చెండాడుతుంటుంది. అంతటి వీరనారితోనా తాను ప్రేమలో పడింది అని ఆశ్చర్యపోతుంటాడు. తను ఎంత వీరనారి అయినా ఒక ఆడదే కదా! నేను మగాడిని అని నిరూపించడానికి వెంట పడతాడు. అంతేనా ఓవైపు అవంతిక కత్తి దూసి మీది మీదికి వస్తుంటే తెలివిగా, ఒడుపుగా తప్పించుకుని తన ఒంటిపైన ఉన్న ఒక్కో వస్త్రాన్ని విప్పేస్తుంటాడు. అలా చివరికి అవంతికలోని ఆడతనాన్ని బైటి ప్రపంచానికి ఆవిష్కరిస్తాడు. అద్దంలా మెరిసిపోతున్న నీటి ప్రవాహంలో తనని తాను చూసుకుని అవును అమ్మాయినే కదా అనుకుంటుంది. అనంతరం తనతో ఆ అందమైన ప్రకృతి అందాల నడుమ శివుడు శృంగారం కూడా చేస్తాడు.

అయితే ఈ సన్నివేశమంతా రొమాంటిక్‌ ప్రాసెస్‌ లో సాగుతుంది. కానీ దీన్ని సదరు జర్నలిస్ట్‌ వేరే కోణంలో చూశారు. ఇది రేప్‌ ఎలియాస్‌ మానబంగం కాకపోతే మరేంటి? బలవంతమైన సెక్స్‌ ఇది. ఒకమ్మాయిని బట్టలు విప్పేసి, వశపరుచుకోవడానికి ఆమె ఏమన్నా జంతువా? మీరు చూపించింది జంతు వాంఛ.. అంటూ కడిగేశారు సదరు జర్నలిస్ట్‌. మీ అక్కా, చెల్లిని ఓ మగాడు ఇలా చేస్తే ఊరుకుంటారా? అంటూ ప్రశ్న లేవనెత్తారు. ఇదే మగతనమనుకుంటే రాజమౌళి మృగమే అంటూ తిట్టిపోశారు. ఈ ప్రశ్నకు రాజమౌళి ఏం సమాధానమిస్తారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News