టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు కంటెంట్ బేస్డ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ ఒకరు. ఈ క్రమంలో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నాడు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో వర్క్ చేసిన సదరు దర్శకుడు.. కోలీవుడ్ - బాలీవుడ్ లలో కూడా సత్తా చాటాడు. ఆ మధ్య రెండు ప్లాప్స్ తో కాస్త డీలా పడ్డాడు కానీ.. ఇప్పుడు ఓ స్టార్ హీరోతో చేసే భారీ సినిమాతో ఫార్మ్ లోకి రావాలని చూస్తున్నాడు. అయితే ఆ దర్శకుడు సినీ కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా సాగిస్తున్నప్పటికి.. పర్సనల్ లైఫ్ మాత్రం లీడ్ చేయలేకపోయాడు.
నాలుగేళ్ళ క్రితం దర్శకుడిగా మంచి ఫార్మ్ లో ఉన్నప్పుడు అతని వివాహం జరిగింది. అయితే రెండేళ్ల దాంపత్య జీవితం కొనసాగించిన ఈ జంట కొన్ని మనస్పర్థల కారణంగా చట్టబద్ధంగా విడాకులు తీసుకొని విడిపోయారు. డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన కొద్దికాలంలోనే భార్యతో విడిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే వీరిద్దరూ విడిపోయిన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆ దర్శకుడు తన భార్యతో విడిపోవడానికి ఆయనతో పని చేసిన ఓ హీరోయిన్ కారణమట. సదరు డైరెక్టర్ ఆ హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటం భరించలేని ఆయన భార్య.. ఈ విషయంపై పలుమార్లు హెచ్చరించిందట. అయినా మార్పు రాకపోవడంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకుని కోర్టును ఆశ్రయించారట. ఆ తర్వాత వీరికి కోర్టు విడాకులు మంజూరు చేయడం.. విడిపోవడం.. ఆ డైరెక్టర్ మళ్ళీ సినిమాలతో బిజీ అవడం జరిగిపోయాయి.