అద్దెల రూపంలోనే కోట్లు దండుకుంటున్న హీరో

Update: 2022-09-09 02:30 GMT
దాదాపు 27650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ తో సల్మాన్ ఖాన్ తన కమర్షియల్ స్పేస్ లీజును ఇటీవల పునరుద్ధరించారు. ముంబై  సబర్బన్ లోని ప్రధాన ప్రదేశంలో భారీ ఆస్తిని కలిగి ఉన్న సూపర్ స్టార్ దానిని ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ కు అనుబంధంగా ఉన్న TNSI రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కు లీజుకు ఇచ్చాడు. సెప్టెంబరు 5న లీజును పునరుద్ధరించారు. ప్రారంభ లీజు నెల‌కు దాదాపు రూ. 89.6 లక్షలు (మొద‌టి ఏడాది).. దానిని రెండవ సంవత్సరంలో 94.08 లక్షలకు పెంచుతారు.

ఈ వాణిజ్య స్థలం గురించి వివ‌రాల్లోకి వెళితే.. ముంబై- శాంటాక్రూజ్ వెస్ట్‌లో ఉన్న భవనం దిగువ అంతస్తు.. గ్రౌండ్ ఫ్లోర్... మొదటి అంతస్తు -రెండవ అంతస్తుతో కూడుకున్న ఏరియా అంతా. టి.ఎన్.ఎస్.ఐ రిటైల్ గ్రూప్ సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.2.68 కోట్లు ఇప్ప‌టికే చెల్లించింది. కార్పెట్ ఏరియాగా 23042 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంద‌ని స‌మాచారం.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..  సల్మాన్ ఖాన్ తదుపరి కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లో న‌టిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే- షెహనాజ్ గిల్- సిద్ధార్థ్ నిగమ్ తారాగ‌ణం. అలాగే టైగర్ 3లో కూడా కనిపిస్తాడు. ఇందులో కత్రినా కైఫ్ -ఇమ్రాన్ హష్మీ త‌దిత‌రులు నటించారు. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

ముంబైలోని ఖ‌రీదైన ఏరియాల్లో స‌ల్మాన్ తో పాటు ప‌లువురు స్టార్లకు ఒక‌టికి మించి ఈ త‌ర‌హా ఆస్తులు ఉన్నాయి. వీటికి అద్దెల రూపంలోనే నెల‌కు ల‌క్ష‌లాది రూపాయ‌ల్ని వ‌సూలు  చేస్తున్నారు.

సినీరంగంలో భారీ పారితోషికాల్ని రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెడుతూ వాటిని ఆదాయ‌వ‌న‌రులుగా మ‌లుచుకుంటున్న స్టార్లు ఎందరో ఉన్నారు. టాలీవుడ్ లోనూ ప‌లువురు స్టార్లు రియ‌ల్ వెంచ‌ర్ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News