షూటింగ్ చేసే వేళ.. తాను అనుకున్నట్లుగా పని జరగనప్పుడు.. దర్శకుడు ఎంత కోపంగా ఉంటారన్నది అందరికి తెలిసిన విషయమే అయినా.. కొందరు దర్శకుల గురించి తెలిసినప్పుడు మాత్రం.. వామ్మో.. ఇంత కఠినంగా ఉంటారా? అన్న భావన కలగటం ఖాయం. తాజాగా క్రియేటివ్ డైరెక్టర్.. మిగిలిన దర్శకుల సినిమాలకు భిన్నమైన మూవీల్ని తీసే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ షూటింగ్ వేళ ఎలా ఉంటారన్న విషయాన్ని వెల్లడించి అందరిని సర్ ప్రైజ్ చేశాడు బాలీవుడ్ చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రణ్ బీర్ కపూర్.
ఈ స్టార్ డైరెక్టర్ వద్ద ఒకప్పుడు.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంతకాలం పని చేశాడు రణ్ బీర్. ఆ సందర్భంగా తాను ఎదుర్కొన్న అనుభవాల్ని వెల్లడించారు. తాజాగా రాజ్ కపూర్.. ద మాస్టర్ ఎట్ వర్క్ అనే పుస్తకాన్ని లాంఛ్ చేయటానికి వచ్చిన రణ్ బీర్.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ఇదే ప్రోగ్రాంకు వచ్చిన నటుడు రణ్ ధీర్ కపూర్ మాట్లాడుతూ.. నేటి తరం దర్శకులు కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రాజ్ కపూర్ శకం ముగిసినట్లేనని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో మాట్లాడిన రణ్ బీర్ కపూర్.. రణ్ ధీర్ కపూర్ చేసిన వ్యాఖ్యల్ని కొంత మేర మాత్రమే తాను సమర్థించగలనని పేర్కొంటూ.. అందరూ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రియేటివ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తావనను తీసుకొచ్చారు. భన్సాలీ వద్ద తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేటప్పుడు గంటల కొద్దీ సమయం మోకాళ్ల మీద కూర్చోవాల్సి వచ్చేదని గుర్తు చేసుకున్నారు.
అంతేకాదు.. భన్సాలీ తనని తిట్టేవారని.. కోపం మరింత ఎక్కువగా వస్తే కొట్టేవాడని అప్పటి విషయాల్ని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే ఇలాంటివి ఎదురుకావటం వల్ల.. తాను బయట ప్రపంచాన్ని ఎదుర్కొనేలా తాను తయారైనట్లు చెప్పారు. ఆ అనుభవాలు తనను మరింతలా రాటుదేల్చాయని చెప్పారు. స్టార్ స్టేటస్ అంత తేలిగ్గా రాదని.. అందుకోసం ఎన్నో కష్టాలు.. నష్టాలు ఎదుర్కోవాలన్న విషయం రణ్ బీర్ మాటల్ని విన్నంతనే అర్థం కాక మానదు.